శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 18, 2021 , 18:23:27

విప‌ణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ

విప‌ణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ

న్యూఢిల్లీ: ప‌్ర‌ముఖ ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూట‌ర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దేశీయ మార్కెట్‌లోకి స్పోర్టీ ఎడిష‌న్ స్కూట‌ర్ గ్రాజియాను సోమ‌వారం విడుద‌ల చేసింది. గురుగ్రామ్‌లోని షోరూమ్‌లో దీని ధ‌ర రూ.82,564గా నిర్ణ‌యించారు. ఈ స్కూట‌ర్‌ను పూర్తిగా స్పోర్టీ క‌ల‌ర్‌, గ్రాఫిక్స్‌తో డిజైన్ చేశారు. రేసింగ్ స్ట్రైప్స్‌, రెడ్‌బ్లాక్ క‌ల‌ర్డ్ రేర్ స‌స్పెన్ష‌న్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఈ స్కూట‌ర్‌లో జ‌త క‌లిశాయి.

ఈ మేర‌కు హెచ్ఎంఎస్ఐ సీఈవో కం ప్రెసిడెంట్ అతుషి ఒగాటా మాట్లాడుతూ గ‌త 20 ఏళ్ల‌లో భార‌త్ స్కూట‌ర్ మార్కెట్‌ను పూర్తిగా పునఃఆవిష్క‌రించామ‌ని చెప్పారు. హోండా గ్రాజియా స్కూట‌ర్ ప్రీమియం స్కూట‌ర్ల విభాగంలో అత్యంత ఆస‌క్తిని రేకెత్తిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. యువ‌త‌ను ఆక‌ర్షించే ల‌క్ష్యంతో హోండా గ్రాజియా రూపుదిద్దుకున్న‌ద‌న్నారు.

హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్ట‌ర్ య‌ద్వీంద‌ర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. విద్యాసంస్థ‌లు పునఃప్రారంభం కానున్నాయి. ఈ త‌రుణంలో టూ వీల‌ర్‌పై విద్యాసంస్థ‌ల‌కు వెళ్లాల‌నుకునే వారికి గ్రాజియా స్పోర్ట్స్ స్కూట‌ర్ స‌రైన ఛాయిస్‌గా ఉంటుంద‌న్నాయ‌న్నారు. న్యూ గ్రాజియా స్పోర్ట్స్ ఎడిష‌న్ దేశ‌వ్యాప్తంగా అన్ని టూ వీల‌ర్ డీల‌ర్‌షిప్‌ల‌లో ల‌భ్యం అవుతుంద‌ని హెచ్ఎంఎస్ఐ తెలిపింది. బీఎస్‌-6 ప్ర‌మాణాల‌తో రూపుదిద్దుకున్న గ్రాజియా స్పోర్ట్స్ ఎడిష‌న్ 125 సీసీ ఇంజిన్ సామ‌ర్థ్యంతో త‌యారైంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo