మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jun 27, 2020 , 18:50:45

ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వమన్న హోండా మోటార్స్‌

ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వమన్న హోండా మోటార్స్‌

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫే‌స్‌బుక్‌కు వ్యతిరేకంగా పలు కంపెనీలు ఇప్పటికే తమ గళం విప్పాయి. తాజాగా హోండా మోటార్స్‌ కంపనీ కూడా ఈ జాబితాలో చేరింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలో ప్రకటనలు ఇచ్చేది లేదంటూ ఇప్పటికే పలు కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ప్రస్తుతం హోండా మోటార్స్‌ కూడా వారికి అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇవ్వమని నిర్ణయించకున్నది. వచ్చే నెల నుంచి తమ ప్రకటనలను ఉపసంహరించుకొంటున్నట్టు వెల్లడించింది.

“జూలై నెల నుంచి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికన్‌ హోండా తన ప్రకటనలను నిలిపివేస్తున్నది. ద్వేషానికి, జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఐక్యమైన వ్యక్తులతో నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మానవ గౌరవం ఆధారంగా మా కంపెనీ విలువలతో సరిపడదు" అని జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

“ఇది మన దేశానికి, ప్రపంచానికి చాలా బాధాకరమైన సమయం. కొవిడ్ -19 మహమ్మారి వ్యాప్తితో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో జార్జ్ ఫ్లాయిడ్, అహ్మద్ అర్బరీ, బ్రయోనా టేలర్‌ల విషాదకరమైన మరణాలను చూశాం, ఇవన్నీ జాత్యాహంకారం, అన్యాయం యొక్క దీర్ఘకాలికంగా లోతుగా పాతుకుపోయిన సమస్యలకు సంబంధించి మన సమాజం ప్రాతినిధ్యం వహిస్తోంది“ అని హోండా ఉత్తర అమెరికా జారీ చేసిన మరో ప్రకటనలో తెలిపింది.


logo