బుధవారం 03 మార్చి 2021
Business - Dec 23, 2020 , 18:03:09

ఇక ఆ రెండు కార్లు ఇండియాలో దొర‌క‌వు!

ఇక ఆ రెండు కార్లు ఇండియాలో దొర‌క‌వు!

న్యూఢిల్లీ: త‌మ సంస్థ‌కు చెందిన రెండు కార్లు ఇక ఇండియాలో అందుబాటులో ఉండబోవ‌ని తెలిపింది హోండా ఇండియా. దేశంలోని రెండు ప్లాంట్ల‌లో ఒక దానిని మూసివేయాల‌ని సంస్థ నిర్ణ‌యించ‌డ‌మే దీనికి కార‌ణం. హోండా సివిక్‌, హోండా సీఆర్‌-వీ కార్ల ఉత్ప‌త్తిని ఆపివేస్తున్న‌ట్లు హోండా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం హోండాకు గ్రేట‌ర్ నోయిడా, రాజ‌స్థాన్‌లోని త‌పుక‌రాల‌లో ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో గ్రేట‌ర్ నోయిడా ప్లాంట్‌ను ఆ సంస్థ మూసివేయ‌నుంది. ఇందులో ఈ రెండు మోడ‌ల్స్‌తోపాటు హోండా సిటీ కూడా త‌యారవుతోంది. హోండా సిటీని త‌పుక‌రా ప్లాంట్‌కు త‌ర‌లించ‌గా.. మిగిలిన రెండు మోడ‌ల్స్ ఉత్ప‌త్తిని నిలిపేయాల‌ని హోండా నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతానికి ఉన్న స్టాక్ మొత్తం అమ్మేసిన త‌ర్వాత త‌మ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ రెండు మోడ‌ల్ కార్ల‌ను హోండా తొల‌గించ‌నుంది. త‌పుక‌రాలో చిన్న‌, మ‌ధ్య స్థాయి కార్లు ఎక్కువ‌గా త‌యార‌వుతాయ‌ని, అక్క‌డ ఈ రెండు మోడ‌ల్స్‌ను త‌యారు చేసే అవ‌కాశం లేక‌పోవ‌డం వ‌ల్లే వాటి ఉత్ప‌త్తిని నిలిపేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సంస్థ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయ‌ల్ తెలిపారు. 

VIDEOS

logo