గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 07, 2021 , 18:25:57

హోండా యాక్టివా సరికొత్త రికార్డు

హోండా యాక్టివా సరికొత్త రికార్డు

ముంబై: భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహన బ్రాండ్‌ హోండా యాక్టివా సరికొత్త రికార్డు సృష్టించింది. యాక్టివా విక్రయాలు 2.5 కోట్ల  మార్క్‌ను అధిగమించాయని హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రకటించింది.  ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి స్కూటర్‌ బ్రాండ్‌ ఇదే కావడం విశేషం. భారత ద్విచక్ర వాహన పరిశ్రమ చరిత్రలో ఇంత స్వల్పకాలంలో ఈ స్థాయిలో స్కూటర్లను విక్రయించిన కంపెనీ హోండానే.

20ఏండ్ల క్రితం 2001లో తొలిసారి భారత్‌లో యాక్టివాను ఆవిష్కరించారు.  మార్కెట్లోకి అడుగుపెట్టిన మూడేండ్లలోనే స్కూటర్‌ సెగ్మెంట్‌లో యాక్టివా మార్కెట్ లీడర్‌గా అవతరించింది. 2008-09లో 110సీసీ ఇంజిన్‌తో యాక్టివ్‌ను కస్టమర్లకు పరిచయం చేశారు. కంపెనీ ఇటీవల బీఎస్‌6 వెర్షన్‌ వాహనాన్ని లాంచ్‌ చేయగా వీటికి కూడా వినియోగదారులను నుంచి విశేషాదరణ లభించింది. 

VIDEOS

logo