శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Business - Jan 17, 2020 , 00:30:18

బీఎస్‌-6లో మరో యాక్టివా

బీఎస్‌-6లో మరో యాక్టివా
  • ప్రారంభ ధర రూ.63,912

ముంబై, జనవరి 16: బీఎస్‌-6 శ్రేణిలో సరికొత్త యాక్టివాను ఆవిష్కరించింది హోండా. 110 సీసీ సామర్థ్యంతో బుధవారం ఇక్కడ ఈ యాక్టీవా మార్కెట్‌కు పరిచయమైంది. స్టాండర్డ్‌, డీలక్స్‌ అనే రెండు రకాల్లో ఆవిష్కృతమైన ఈ టూవీలర్‌ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.63,912గా ఉన్నది. ఈ నెలాఖరు, వచ్చే నెలారంభం మధ్య కొనుగోలుదారులకు అందిస్తామని ఈ సందర్భంగా హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూట ర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తెలిపింది. బీఎస్‌-6 శ్రేణిలో ఇప్పటికే రెండు మోడల్స్‌ను హోండా తెచ్చిన విషయం తెలిసిందే. తాజా యాక్టివా మూడో మోడల్‌ అవగా, ఇందులో హోండా ఎకో టెక్నాలజీ ఇంజిన్‌, ఈఎస్‌పీ టెక్నాలజీలున్నాయని సంస్థ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు వైఎస్‌ గులేరియా వెల్లడించారు. కాగా, సమీప భవిష్యత్‌లో దేశీయ ఆటో రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు తొలిగే వీల్లేదని గులేరియా వ్యాఖ్యానించారు.


logo