e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News వ‌డ్డీ రేటు త‌గ్గుతుంద‌ని హోమ్ లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంటున్నారా? ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి..

వ‌డ్డీ రేటు త‌గ్గుతుంద‌ని హోమ్ లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంటున్నారా? ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి..

home loan transfer | ఈ మ‌ధ్య కాలంలో హోమ్ లోన్ల‌పై బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తున్నాయి. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. కొత్త‌గా లోన్ తీసుకునే వారితో పాటు వేరే బ్యాంకుల్లో హోం లోన్ ఉన్న వారిని కూడా త‌మ‌వైపు తిప్పుకునేందుకు ర‌క‌ర‌కాల ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. హోం లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంటే.. త‌క్కువ వ‌డ్డీరేటుతో పాటు హాలీ డే, గిఫ్ట్ ఓచ‌ర్లు పొంద‌వ‌చ్చ‌ని క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. దీంతో కొంత మంది లోన్ ట్రాన్స్‌ఫ‌ర్‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు. మ‌రి త‌క్కువ వ‌డ్డీ రేటు ఉన్న బ్యాంకులోకి హోం లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే నిజంగానే బెనిఫిట్ పొంద‌వ‌చ్చా? లేదా అద‌న‌పు భారం ప‌డుతుందా? ఈ వివ‌రాల‌ను ఒక‌సారి తెలుసుకుందాం..

లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ ( home loan transfer )అంటే ఏంటి?

ఒక బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న త‌ర్వాత కొంత‌కాలానికి ఆ బ్యాంకులోని వ‌డ్డీ రేటు, ఇత‌ర‌త్రా విష‌యాలు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. అలాంటి స‌మ‌యంలో మ‌న‌కు న‌చ్చిన బ్యాంకుకు హోమ్ లోన్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే లోన్ ట్రాన్స్‌ఫ‌ర్‌. ఇది ఒక‌ర‌కంగా కొత్తగా లోన్ తీసుకోవ‌డం లాంటిదే. అంటే మీరు ఏ బ్యాంకుకు అయితే లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంటారో.. ఆ బ్యాంకు మీకు కొత్త‌గా లోన్ ఇస్తుంది. కాక‌పోతే ఆ మొత్తాన్ని మీకు కాకుండా.. మీ ఎగ్జిస్టింగ్ లోన్ ఉన్న బ్యాంకుకు చెల్లిస్తుంది. ఇక కొత్త బ్యాంకులో.. కొత్త‌గా లోన్ తీసుకుంటున్న‌ప్పుడు వ‌ర్తించే వ‌డ్డీరేటు, ఈఎంఐలే వ‌ర్తిస్తాయి.

ప్రాసెస్ ఎలా..

  • ముందుగా ఎగ్జిస్టింగ్ బ్యాంకు నుంచి లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ కోసం నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ (ఎన్‌వోసీ) తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఎన్‌వోసీతో పాటు పెండింగ్ ఉన్న లోన్ మొత్తానికి సంబంధించిన వివ‌రాల‌ను కూడా బ్యాంకు అందిస్తుంది.
  • ఈ రెండింటినీ కూడా ఏ బ్యాంకులో లేదా ఏ రుణ సంస్థ‌లోకి లోన్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని అనుకుంటున్నామో.. ఆ బ్యాంకులో అంద‌జేయాలి.
  • వాటిని ప్రాసెస్ చేసిన త‌ర్వాత‌.. లోన్ అమౌంట్‌ను ఎగ్జిస్టింగ్ బ్యాంకుకు చెల్లిస్తారు.
  • ఒక్క‌సారి రుణం మొత్తం చెల్లించ‌గానే.. పాత బ్యాంకు మీ లోన్ అకౌంట్‌ను ర‌ద్దు చేసి.. అన్ని డాక్యుమెంట్ల‌ను కొత్త బ్యాంకుకు అందిస్తుంది.

లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసే ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి..

ఐదేళ్ల లోపు అయితేనే బెట‌ర్

- Advertisement -

రుణం తీసుకున్న కొత్త‌లో అంటే మొద‌టి ఐదేళ్ల‌లో లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంటే కొంత క‌లిసివ‌స్తుంది. ఎందుకంటే హోమ్ లోన్‌లో మ‌నం ముందు చెల్లించే ఈఎంఐల్లో ఎక్కువ మొత్తం వ‌డ్డీ కిందే పోతుంది. అలాంట‌ప్పుడు త‌క్కువ వ‌డ్డీ రేటు ఉన్న బ్యాంకుకు మార‌డం వ‌ల్ల ఈ భారం త‌గ్గుతుంది. లోన్ పీరియ‌డ్ మ‌ధ్య‌లో ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే అప్పటివ‌ర‌కు మీరు ఈఎంఐల రూపంలో చెల్లించిన మొత్తంలో ఎక్కువ శాతం వ‌డ్డీ కింద‌కే పోతుంది. కాబ‌ట్టి మ‌ధ్య‌లో లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంటే.. అద‌నంగా మ‌ళ్లీ వ‌డ్డీ భారం మోయాల్సి వ‌స్తుంది.

వ‌డ్డీ రేటులో వ్య‌త్యాసం ఉంటే..

ఎగ్జిస్టింగ్ లోన్ వ‌డ్డీ రేటుకు, ఇత‌ర బ్యాంకుల్లోని వ‌డ్డీ రేటుకు మ‌ధ్య కేవ‌లం 5 నుంచి 20 బేసిస్ పాయింట్ల వ్య‌త్యాసం ఉన్న‌ట్ల‌యితే లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోక‌పోవ‌డమే మంచిది. ఒక‌వేళ 25 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే ట్రాన్స్‌ఫ‌ర్ గురించి ఆలోచించ‌వ‌చ్చు.

ఫ్లోటింగ్‌లోకి అయితే మార‌వ‌చ్చు

మీ ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్ ఫిక్స్‌డ్ ఉన్న‌ట్ల‌యితే ఫ్లోటింగ్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌డం మంచిదే. ఎందుకంటే ఆర్బీఐ హోం లోన్‌పై వ‌డ్డీ రేట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మారుస్తూ ఉంటుంది. చాలా వ‌ర‌కు వ‌డ్డీ రేట్లు త‌గ్గుతూనే ఉంటాయి. కాబ‌ట్టి మీ పాత బ్యాంకులో హోం లోన్ వ‌డ్డీ రేటు ఫిక్స్‌డ్‌గా ఉన్న‌ట్ల‌యితే.. ఫ్లోటింగ్‌కి మార‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది. అలాగే ఫ్లోటింగ్ వ‌డ్డీ రేట్లు ఉండ‌టం వ‌ల్ల ముంద‌స్తు చెల్లింపుల ( ప్రీ క్లోజింగ్ చార్జెస్ )పై జ‌రిమానా కూడా ప‌డ‌దు.

అద‌న‌పు ఫీజు భారం

లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ అంటే కొత్త‌గా రుణం తీసుకున్న‌ట్టే. లోన్ తీసుకున్న కొత్త‌లో చేసిన‌ట్టుగానే ట్రాన్స్‌ఫ‌ర్ అప్పుడు కూడా పేప‌ర్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. కాబ‌ట్టి మ‌నం ఏ బ్యాంకుకు అయితే లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తామో.. ఆ బ్యాంకు అధికారులు మీ ద‌గ్గ‌ర నుంచి ప్రాసెసింగ్ ఫీజు, లీగ‌ల్, వ్యాల్యుయేష‌న్ ఫీజుల‌తో పాటు స్టాంప్ డ్యూటీని కూడా వ‌సూలు చేస్తుంది. ఔట్ స్టాండింగ్ లోన్‌పై 0.25 శాతం నుంచి ఒక శాతం వ‌ర‌కు అద‌నంగా ఛార్జ్ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి వీటిని కూడా లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునేట‌ప్పుడు ఈ అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం మంచిది.

పెనాల్టీ ఛార్జీలు

కొన్ని బ్యాంకుల్లో లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ కోసం వినియోగ‌దారుడి నుంచి పెనాల్టీ ఛార్జీల‌ను వ‌సూలు చేస్తుంటాయి. కాబ‌ట్టి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవానికి ముందు హోం లోన్ డాక్యుమెంట్ల‌ను క్షుణ్నంగా చ‌దువుకోవ‌డం మంచిది. ట్రాన్స్‌ఫ‌ర్ కోసం ఎలాంటి పెనాల్టీ లేక‌పోతే మంచిదే. ఒక‌వేళ పెనాల్టీ ఉంటే.. ఎంత మొత్తం ఛార్జి చేస్తారో తెలుసుకోవ‌డం అవ‌స‌రం. ఎందుకంటే ఇప్ప‌టికే కొత్త బ్యాంకులో లోన్ ప్రాసెసింగ్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దానికి తోడు ఎగ్జిస్టింగ్ బ్యాంకులో పెనాల్టీ చెల్లించ‌డ‌మంటే.. అద‌న‌పు భారం ప‌డుతుంది.

హోంలోన్‌తో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా?

సాధార‌ణంగా హోం లోన్ తీసుకుంటున్నామంటే.. దానికి తోడు ఇన్సూరెన్స్ తీసుకోమ‌ని బ్యాంకు అధికారులు సూచిస్తుంటారు. లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ అప్పుడు కూడా అలాగే ఇన్సూరెన్స్ తీసుకోమ‌ని అడుగుతుంటారు. అయితే కొన్ని బ్యాంకుల్లో మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందేన‌ని అధికారులు ఒత్తిడి చేస్తుంటారు. కానీ లోన్‌తో పాటు ఇన్సూరెన్స్ కావాలా? వ‌ద్దా ? అనేది పూర్తిగా మీపైనే ఆధార‌ప‌డి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Must Read Books : స‌త్య నాదెళ్ల‌, జెఫ్ బెజోస్ రెక‌మండ్ చేసిన ఈ పుస్త‌కాల‌ను ప్ర‌తి ఒక్క‌రు చ‌దవాల్సిందే

Taxi Top Garden : క‌రోనా ఎఫెక్ట్‌.. క్యాబ్‌ల‌ను ఖాళీగా ఉంచ‌లేక‌.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు

ఆధార్‌, పోస్ట్ ఆఫీస్ ప్రాంచైజ్‌లు తీసుకోండి.. ఊళ్లోనే ఉంటూ డ‌బ్బులు సంపాదించండి

అబ్ర‌హం లింక‌న్ గ‌డ్డం పెంచ‌డం వెనుక ఉన్న క‌థేంటో తెలుసా !

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement