శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 10, 2021 , 20:05:29

హోంలోన్‌ బ‌దిలీలకు మొగ్గు.. వ‌డ్డీ ఆదాకేనా?!

హోంలోన్‌ బ‌దిలీలకు మొగ్గు.. వ‌డ్డీ ఆదాకేనా?!

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుతం ప‌లు ప్ర‌భుత్వ రంగ‌, ప్రైవేట్ బ్యాంకులు 6.9-9 శాతం వ‌డ్డీరేట్ల‌పై అర్హులైన వారికి ఇంటి రుణాలు మంజూరు చేస్తున్నాయి. భారీగా త‌గ్గిన వ‌డ్డీరేట్లు.. ఇప్ప‌టికే హోం లోన్ తీసుకున్న రుణ గ్ర‌హీత‌లు త‌మ మిగ‌తా రుణానికి త‌క్కువ వ‌డ్డీరేటు వ‌ర్తింప జేయ‌డానికి ప్ర‌స్తుత ప‌రిస్థితిని సావ‌కాశంగా తీసుకుంటున్నారు.ప్ర‌స్తుతం హోంలోన్ అత్య‌ధికుల‌కు అతిపెద్ద‌ది కూడా. అలాగే ప్ర‌తి ఇంటి కొనుగోలు దారుడు.. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకుల నుంచి రుణం పొంది ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేస్తారు. 

పోటీ ప్ర‌పంచంలో బ్యాంకుల విభిన్న వ‌డ్డీరేట్లు

ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో విభిన్న బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌కు ఇంటి రుణాల‌పై విభిన్న వ‌డ్డీ రేట్లు ఆఫ‌ర్ చేస్తున్నాయి. రుణ గ్ర‌హీత‌లు కూడా ప‌లు కార‌ణాల రీత్యా.. త‌మ‌కు అనుకూల‌మైన నిబంధ‌న‌లు, వడ్డీరేట్లు అమ‌లులో ఉన్న సంస్థ‌లు, బ్యాంకుల నుంచి ఇంటి రుణాలు తీసుకోవ‌డానికి ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు.

వ‌డ్డీ త‌గ్గింపుతో ఆదాకు రుణ గ్ర‌హీత‌ల మొగ్గు

అయితే, క‌రోనా నేప‌థ్యంలో దెబ్బ‌తిన్న దేశీయ ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌రుత్తేజానికి బ్యాంకులు ఇళ్ల రుణాల‌పై వ‌డ్డీరేట్లు త‌గ్గించి వేశాయి. దీని ఆస‌రాగా ప్ర‌తి ఇంటి రుణ గ్ర‌హీత‌.. త‌మ ముందుకు వ‌చ్చిన బ్యాంకుల‌తో హోంలోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్‌కు ప్రాధాన్యం ఇచ్చి వ‌డ్డీరేటు త‌గ్గించుకోవ‌డం ద్వారా త‌మ‌పై ఆర్థిక భారం త‌గ్గించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు అనుగుణంగా కొంద‌రు రుణ గ్ర‌మీత‌లు తమ నెల‌స‌రి వాయిదాల త‌గ్గింపు ద్వారా ఆర్థిక భారాన్ని అధిగ‌మించేందుకు మొగ్గు చూపుతున్నారు. 

అధిక వ‌డ్డీరేటు నుంచి త‌క్కువ ఇంట‌రెస్ట్‌కు మారితే ఆదా

అత్య‌ధిక కేసుల్లో ఔట్‌స్టాండింగ్ హోంలోన్ మొత్తంపై ఓవ‌రాల్ వ‌డ్డీరేట్ త‌గ్గించుకోవ‌డానికే అత్య‌ధిక రుణ గ్ర‌హీత‌లు త‌మ ఇంటి రుణాన్ని ఒక బ్యాంకు నుంచి మ‌రో బ్యాంకుకు మార్చుకోవ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది అధిక వ‌డ్డీరేటుపై బ్యాంకు నుంచి రుణం తీసుకున్న ఇంటి రుణ గ్ర‌హీత‌ల‌కు స‌హాయ‌కారిగా ఉంటుంది. అటువంటి వారి క్రెడిట్ ప్రొఫైల్ కూడా మెరుగవుతుంది. 

ప్రాసెసింగ్ అండ్ అద‌ర్ ఫీజులు య‌థాత‌థం

అయితే, ఒక బ్యాంకు నుంచి మ‌రో బ్యాంకుకు ఇంటి బ్యాలెన్స్ రుణం బ‌దిలీ చేసుకున్న‌ప్పుడు.. దాఖ‌లు చేసే హోంలోన్ అప్లికేష‌న్‌ను ఫ్రెష్‌లోన్ అప్లికేష‌న్‌గా నూత‌న బ్యాంక‌ర్ ప‌రిగ‌ణిస్తార‌న్న విష‌యాన్ని రుణ గ్ర‌హీత‌లు గుర్తుంచుకోవాలి. తాజా రుణంగా ప‌రిగ‌ణిస్తే ప్రాసెసింగ్ ఫీజు, అడ్మినిస్ట్రేటివ్, ఇత‌ర చార్జీల భారం.. మీ బ్యాలెన్స్ రుణం చెల్లింపులో ఓవ‌రాల్‌గా వ‌డ్డీరేటు త‌గ్గింపుతో ఎంత ఆదా అవుతుందో మీరు తెలుసుకోవ‌డం కీల‌కం. ఓవ‌రాల్ వ‌డ్డీ పొదుపు గ‌ణ‌నీయంగా ఉంటుంద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చాకే బ్యాలెన్స్ లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆప్ష‌న్‌ను ఆమోదించాలి సుమా!

అయితే, ఒక బ్యాంక‌ర్ నుంచి మ‌రో బ్యాంక‌ర్‌కు మారే ముందు మీరు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అంశాలివి:

బ్యాంకు చార్జీల చెల్లింపులు అద‌నం

రుణాల బ‌దిలీ స‌మ‌యంలో పాత రుణంపై ప్రీ పేమెంట్ చార్జీలు, నూత‌న లోన్‌మీద ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చార్జీలు, టెక్నిక‌ల్‌/ల‌ఈగ‌ల్ ఫీ త‌దిత‌ర ఫీజులు రుణ గ్ర‌హీత‌కు అద‌న‌పు ఖ‌ర్చు.  రుణ‌దాత మార్పు వ‌ల్ల ఉదాహ‌ర‌ణ‌కు 7.4 శాతం వ‌డ్డీరేటుపై 15 ఏళ్ల‌లో చెల్లించ‌డానికి రూ.50 ల‌క్ష‌ల రుణం తీసుకుని ఉంటే.. ప్ర‌స్తుతంం 50 బేసిక్ పాయింట్లు వ‌డ్డీరేట్లు త‌గ్గ‌డంతో ఓవ‌రాల్‌గా రుణ గ్ర‌హీత‌కు రూ.2.5 ల‌క్ష‌ల సొమ్ము ఆదా చేసుకోగ‌లుగుతారు. 

వ‌డ్డీరేట్లు 50 బీపీఎస్ త‌క్కువ ఉంటేనే

వ‌డ్డీరేట్లు గ‌త రుణం కంటే 50 బేసిక్ పాయింట్లు త‌క్కువ‌గా ఉంటేనే రుణ గ్ర‌హీత బ్యాంకును మార్చుకోవ‌డానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతే కాదు మ‌రో ప‌దేండ్లు, అంత‌కంటే ఎక్కువ కాలం చెల్లించాల్సి వ‌చ్చిన‌ప్పుడు కూడా మార్చుకోవ‌చ్చు. 10 ఏళ్ల లోపే రుణం చెల్లింపు గ‌డువు ఉంటే పాత వ‌డ్డీకి, కొత్త వ‌డ్డీకి   50 బేసిక్ పాయింట్ల కంటే ఎక్కువ తేడా ఉంటేనే రుణ‌దాత‌ను మార్చుకునేందుకు ముందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ రుణ‌దాత‌ను మార్చుకునే ఆప్ష‌న్‌తో ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఒక్కో కేసు పరిమితులు ఒక్కోరకంగా ఉంటాయి. 

హోంలోన్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్రాసెస్ ఇలా

ఒక బ్యాంకు నుంచి ఇంటి రుణం తీసుకున్న రుణ గ్ర‌హీత‌.. తాను మార‌ద‌లిచిన బ్యాంక‌ర్ లేదా సంస్థ వ‌ద్ద‌కు వెళ్లాలి. ముందు బ్యాంక‌ర్ నుంచి ఆమోద ప‌త్రంతోపాటు ఇత‌ర డాక్యుమెంట్లు స‌మ‌ర్పించాలి. లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్స్ స‌హా ప‌లు ప‌త్రాలు నూత‌న బ్యాంక‌ర్‌కు ఇవ్వాలి. అప్లికేష‌న్ ప్రాసెస్ చేయ‌డానికి బ్యాంక‌ర్లు, ఆర్థిక సంస్థ‌ల‌కు రెండు నుంచి నాలుగు వారాలు ప‌డుతుంది. పాత బ్యాంకు నుంచి రుణం మూసివేత లెట‌ర్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.. ఈ ప‌త్రాల‌న్నీ కొత్త బ్యాంకర్‌కు ఇచ్చిన త‌ర్వాత అవ‌న్నీ ధ్రువీక‌రించుకున్నాక పాత బ్యాంక‌ర్ పేరిట కొత్త బ్యాంక‌ర్ మంజూరైన రుణం మొత్తానికి చెక్ జారీ చేస్తారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo