HDFC Green Diposits | దేశంలోని అతి పెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ హౌసింగ్ ఫైనాన్స్ డైవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) తాజాగా గ్రీన్ అండ్ సస్టెయినబుల్ డిపాజిట్ స్కీంను ప్రారంభించింది. భూతాప నివారణకు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ స్కీం తీసుకొచ్చింది. ఈ డిపాజిట్ పథకంపై 6.55 శాతం వడ్డీ లభిస్తుంది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా డిపాజిట్ చేయొచ్చు.
హరిత, స్థిరమైన హౌసింగ్ క్రెడిట్ సొల్యూషన్స్, సర్వీసులకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాలను ఉపయోగిస్తామని హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. ఈ స్కీంలో భారతీయులతోపాటు ప్రవాస భారతీయులు (ఎన్నారై) కూడా డిపాజిట్ చేయొచ్చు.
ఈ డిపాజిట్లు 36 నెలల నుంచి 120 నెలల వరకు చేయొచ్చు. రూ. 2 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 6.55 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 6.80 శాతం వడ్డీ లభ్యమవుతుంది. ఆన్లైన్లోనే రూ.50 లక్షలు డిపాజిట్ చేస్తే అదనంగా ఏటా 0.10 శాతం వడ్డీ వస్తుంది.
హరిత, పర్యావరణ హిత ఇండ్ల నిర్మాణానికి డిమాండ్ పెరుగుతుందని సంస్థ చైర్మన్ దీపక్ పరేఖ్ ప్రకటించారు. దీని లక్ష్యాలను అందుకోవడానికి గ్రీన్ అండ్ సస్టెయినబుల్ డిపాజిట్ స్కీం తమ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. మారుతున్న ప్రపంచ అవసరాలను తీర్చడానికి ఈ డిపాజిట్లు ఉపకరిస్తాయి. దీంతో కస్టమర్ల సంపద కూడా పెరుగుతుంది.
హరిత, సుస్థిర కర్భన రహిత ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు నిబద్ధతతో పని చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. భూతాపం నుంచి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ చెప్పారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
జిల్లా వచ్చె.. గడ్డం పాయె ఢాం ఢాం ఢాం..
మేఘాలయలో హింస : హోం మంత్రి రాజీనామా
దేశం విడిచి ఎందుకు వెళ్లిపోయానంటే..? : అష్రఫ్ ఘనీ
ఆ మెసేజ్ అందడానికి 18 గంటలు పట్టింది..!
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన