గురువారం 04 మార్చి 2021
Business - Dec 29, 2020 , 00:13:01

హైదరాబాద్‌లో హెక్సాగాన్‌ ఏఐ

హైదరాబాద్‌లో హెక్సాగాన్‌ ఏఐ

హైదరాబాద్‌: టెక్నాలజీ రంగంలో వస్తున్న వినూత్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి హెక్సాగాన్‌ సంస్థ హైదరాబాద్‌లో ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేసింది.  నాస్కాంతో కలిసి భారత్‌లో ఏర్పాటు చేసిన ఈ తొలి కృత్రిమ మేధస్సు కమ్యూనిటీ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సోమవారం ఆరంభించారు. రూ.64 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ప్రతియేటా 350 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోనున్నారు. ఈ కృత్రిమ మేధస్సు సెంటర్‌ను మరింత విస్తరించడానికి వచ్చే ఏడాదికాలంలో మరో రూ.30 లక్షలు ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థులతోపాటు సీనియర్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఏఐలో ఫండమెంటల్స్‌, అడ్వాన్స్‌ లెవల్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్‌ కోసం హెక్సార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ కోర్సుకు సర్టిఫికేట్‌ కూడా ఇవ్వనున్నారు.  ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020ని కృత్రిమ మేధస్సు సంవత్సరంగా ప్రకటించిందని, దీనిపై వచ్చే ఏడాదిపై కూడా ప్రత్యేక దృష్టి సారించబోతున్నామని చెప్పారు. గతంలో హెచ్‌సీసీఐ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 

VIDEOS

logo