న్యూఢిల్లీ: వచ్చే పండుగ సీజన్లో కొత్త బైకులు కొనుగోలు చేద్దామనే వారికి షాకిచ్చింది హీరో మోటోకార్ప్. అన్ని రకాల మోడళ్ళ ధరలను రూ.3 వేల వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 20 నుంచి అమల్లోకి రానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. పెరిగిన ఉత్పాదక వ్యయమే ధరల పెంపునకు కారణమని తెలిపింది.