గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 06, 2021 , 02:00:39

హీరో రూ.65 మధ్యంతర డివిడెండ్‌

హీరో రూ.65 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,029.17 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.905.13 కోట్లతో పోలిస్తే 13.7 శాతం అధికం. వాహనాలను విక్రయించడం ద్వారా గత త్రైమాసికంలో సంస్థకు 9,827.05 కోట్ల ఆదాయం సమకూరినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. సమీకృత విషయానికి వస్తే రూ.9,775.77 కోట్ల ఆదాయంపై రూ.1,084.47 కోట్ల లాభాన్ని గడించింది. మరోవైపు, రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరు రూ.65 లేదా 3,250 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది సంస్థ. దీంతోపాటు ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ కింద రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు  ఒక ప్రకటనలలో వెల్లడించింది. 

VIDEOS

logo