10 కోట్ల హీరో

న్యూఢిల్లీ, జనవరి 21: దేశంలోని ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో అతి పెద్దదైన హీరో మోటో మోటోకార్ప్ సరి కొత్త చరిత్ర సృష్టించింది. వాహనాల ఉత్పత్తిలో 100 మిలియన్ (10 కోట్ల) యూనిట్ల మైలురాయిని అధిగమించి అసలైన హీరోగా నిలిచింది. హరిద్వార్ లోని తమ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి గురువారం 10 కోట్లవ యూనిట్‌గా ‘ఎక్స్ట్రీమ్ 160ఆర్' బైక్‌ను బయటకు తీసుకురావడం ద్వారా ఈ విశిష్ఠ ఘనతను సాధించినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. మున్ముందు కూడా ఇదే వృద్ధిని కొనసాగించేందుకు రానున్న ఐదేండ్లలో ఏటా పది కంటే ఎక్కువ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. 1984 జనవరి 19న ఏర్పాటైన ఈ కంపెనీ సరిగ్గా పదేండ్ల నాటికి 10 లక్షల యూనిట్లను ఉత్పత్తిచేసి తొలి మైలురాయిని అధిగమించింది. ఆ తర్వాత మరింత జోరు పెంచి 2013లో 5 కోట్ల యూనిట్ల మైలురాయిని, 2017లో 7.5 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ వివరించారు.
తాజావార్తలు
- ఎస్యూవీ కార్లకు ఫుల్ డిమాండ్: ఫిబ్రవరి సేల్స్ మిక్చర్ పొట్లాం!!
- ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి జైలు శిక్ష
- మహిళ ఫిర్యాదుతో ఆప్ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు
- సచిన్ ముందే చూడకుండా రుబిక్ క్యూబ్‌ని సెట్ చేశాడు..వీడియో వైరల్
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం
- బీపీసీఎల్ ఫర్ సేల్: నుమలీగఢ్ రిఫైనరీతో షురూ..!
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో