ఆదివారం 24 మే 2020
Business - Jan 21, 2020 , 01:27:27

ఈ-స్కూటర్‌పై భారీ రాయితీ

ఈ-స్కూటర్‌పై భారీ రాయితీ
  • రూ.7,090 తగ్గించిన హీరో ఎలక్ట్రిక్‌

న్యూఢిల్లీ, జనవరి 20:  హీరో ఎలక్ట్రిక్‌... స్కూటర్‌పై ప్రత్యేక రాయితీ కల్పించింది. స్వల్పకాలం పాటు ఉండే ఈ ఆఫర్‌ కింద ఈ-స్కూటర్‌పై రూ.7,090 డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. పేటీఎం ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.10,500 వరకు ఆదా కానున్నది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఫ్లాష్‌ మోడల్‌ స్కూటర్‌ రూ.29,990కే లభించనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 615 టచ్‌పాయింట్ల వద్ద లభించనున్న 69 కిలోల బరువు కలిగిన ఈ-స్కూటర్‌లో మొబైల్‌ చార్జింగ్‌, రీజనరేటివ్‌ బ్రేకింగ్‌, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌ వంటి నూతన ఫీచర్స్‌తో తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 


logo