శనివారం 28 మార్చి 2020
Business - Jan 31, 2020 , 01:10:46

హెరిటేజ్‌ లాభం 12 కోట్లు

హెరిటేజ్‌ లాభం 12 కోట్లు

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.672.42 కోట్ల ఆదాయంపై రూ.11.71 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.618.76 కోట్ల ఆదాయంతో పోలిస్తే 8.7 శాతం అధికమైంది. వ్యాపార ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ ఈడీ నారా బ్రాహ్మణి తెలిపారు. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో రూ.2,073.26 కోట్ల ఆదాయంపై రూ.40.49 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది సంస్థ.


logo