e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News బిట్ కాయిన్ ముందు ఐదు స‌వాళ్లు.. అవేంటంటే?!

బిట్ కాయిన్ ముందు ఐదు స‌వాళ్లు.. అవేంటంటే?!

బిట్ కాయిన్ ముందు ఐదు స‌వాళ్లు.. అవేంటంటే?!

లండ‌న్‌: డిజిట‌ల్‌, క్రిప్టో లావాదేవీల‌పైనే వివిధ దేశాల క‌రెన్సీల భ‌విత‌వ్యం ఆధార‌ప‌డింది. ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌ల వేల క్రిప్టో క‌రెన్సీల్లో ఒక‌టి బిట్ కాయిన్‌. అది స‌క్సెస్ కాబోద‌ని, అందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. బిట్ కాయిన్ అంటేనే క్రిప్టో క‌రెన్సీ కాద‌న్న అభిప్రాయం కూడా వినిపిస్తున్న‌ది.

క్రిప్టో క‌రెన్సీల‌కు ప‌ర్యాయ‌ప‌దంగా బిట్ కాయిన్ వాడ‌టం త‌ప్ప‌ని చెబుతున్నారు. బిట్ కాయిన్ అంద‌రి నోళ్ల‌లో నానుతున్నా.. అది తీవ్రమైన స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న‌ది.

బంగారంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ప్రాధాన్యం నేప‌థ్యంలో రోజువారీగా వినియోగిస్తున్న క‌రెన్సీ (ఫియ‌ట్ మ‌నీ) కూడా రియ‌ల్ మ‌నీ కాద‌ని అంటున్నారు. కానీ అది స‌రి కాదు. ఫియ‌ట్ మ‌నీని ప్ర‌భుత్వం జారీ చేసినందున దానికి కొంత విలువ హామీ ల‌భిస్తుంది.

ఉదాహ‌ర‌ణ‌కు ఇండియ‌న్ రూపాయి నోటును ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ జారీ చేస్తారు. అది లీగ‌ల్ టెండ‌ర్‌గా ఉంటుంది. అమెరికా డాల‌ర్‌పై లీగ‌ల్ టెండ‌ర్ అన ప‌దాలు కూడా ఉంటాయి.

వివిధ కంపెనీల స్టాక్స్ రియ‌ల్ వాల్యూగా నిలుస్తాయి. కంపెనీల గూడ్స్‌, స‌ర్వీసుల నుంచి లాభాలు స్రుష్టించ‌గ‌ల సామ‌ర్థ్యం స్టాక్స్‌కు ఉంటుంది. ప‌రిశ్ర‌మ‌లు కొనుగోలు చేసే ముడి సరుకుల‌ను గూడ్స్‌, స‌ర్వీసుల ఉత్ప‌త్తికి ఉప‌యోగిస్తారు క‌నుక క‌మోడిటీస్‌కు వాస్త‌విక విలువ ఉంటుంది.

ఎవ‌రైనా వ్య‌క్తి కొంత ధ‌ర చెల్లిస్తేనే బిట్ కాయిన్‌కు విలువ ల‌భిస్తుంది. ఇది పీస్ ఆఫ్ ఆర్ట్ వ‌ర్క్‌. స్థ‌లాన్ని అందంగా తీర్చిదిద్దే సామ‌ర్థ్యం పీస్ ఆఫ్ ఆర్ట్ వ‌ర్క్‌కుంటుంది. ఈ చాన్స్ బిట్ కాయిన్‌కు లేదు.

ప్ర‌భుత్వాలు జారీ చేసే క‌రెన్సీ.. దానిపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. త‌మ క‌రెన్సీల‌ను స్థిరీక‌రించుకోవ‌డానికి వివిధ దేశాల సెంట్ర‌ల్ బ్యాంకులు మార్కెట్ ఆప‌రేష‌న్ల కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ మార్కెట్ల వ‌ద్ద‌కు వెళ్తాయి.

స్థిరీక‌ర‌ణ లేకుండా క‌రెన్సీ ప‌ని చేయ‌లేదు. బిట్ కాయిన్‌లో ఆ స్థిరీక‌ర‌ణ శ‌క్తి లోపించింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. బిట్ కాయిన్ ఉన్నా మీరు దాంతో ఏదీ కొనుగోలు చేయ‌లేరు. ఫియ‌ట్ మ‌నీతోనే మీరేదైనా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

విలువ పెరుగుతుంద‌ని రెండు వారాలు బిట్ కాయిన్ విక్ర‌యించ‌కుండా ఆపితే 20 శాతం పెరుగొచ్చు. ఒక‌వేళ బిట్ కాయిన్ ప‌త‌నం ప్రారంభ‌మైతే దుకాణాదారులు, వెండ‌ర్లు కూడా దాన్ని చెల్లింపుల‌కు అనుమ‌తించ‌డం ఆపేస్తారు.

ఎందుకంటే ఒక వారం త‌ర్వాత దాని విలువ 20 శాతం త‌గ్గాల‌ని ఎవ‌రూ కోరుకోరు.నేష‌న‌ల్ క‌రెన్సీల‌తో బిట్ కాయిన్ పోటీ ప‌డుతుంద‌ని దాని మ‌ద్ద‌తు దారులు చెబుతున్నా.. అదంతా ఊహా జ‌నిత‌మే.

చైనా, అమెరికా, ఈయూ సెంట్ర‌ల్ బ్యాంకులు త‌మ క‌రెన్సీల‌ను నిలిపేసి, బిట్ కాయిన్ వాడ‌తాయా? అటువంట‌ప్పుడు ఏ ఒక్క‌రూ నియంత్ర‌ణ చేయ‌లేరు.. ఆ ప‌రిణామం దేశీయ ద్ర‌వ్య వ్య‌వ‌స్థ‌ల‌కు ప్రాణాంతకంగా మారుతుంది.

ఇటీవలే బిట్ కాయిన్ ట్రేడింగ్‌, మైనింగ్‌ను చైనా నిలిపేసింది. ఇత‌ర దేశాలు కూడా చైనాను అనుస‌రిస్తామ‌ని సంకేతాలిచ్చాయి. ఏ దేశం కూడా బిట్ కాయిన్‌ను అడాప్ట్ చేయ‌డానికి సిద్ధంగా లేదు. సొంత వ‌ర్ష‌న్ క్రిప్టో క‌రెన్సీని జారీ చేశాక బిట్ కాయిన్‌ను నిషేధిస్తాయి.

బిట్ కాయిన్‌లో పెట్టుబ‌డులు బ్లాక్‌చైన్ టెక్నాలజీలో పెట్టిన‌ట్లు కాదు. అమెరికా డాల‌ర్ మ‌ద్ద‌తుతో బ్లాక్ చైన్ టెక్నాల‌జీ వినియోగంతో ప్ర‌పంచ వ్యాప్తంగా క్రిప్టో క‌రెన్సీలు స్టేబుల్గా ఉన్నాయి. మెరుగైన ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్న‌ప్పుడు ఏ ఒక్క‌రూ బిట్ కాయిన్ కొనుగోలు చేయ‌డానికి ముందుకు రారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

ఆటోకు కరోనా సెగ

దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇవ్వండి.. కోవిడ్ నుంచి కోలుకుంటూ కేంద్రానికి థరూర్ విజ్ఞప్తి

ఆన్‌లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సిందే

22 కోట్ల కోవాగ్జిన్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న ముంబై కంపెనీ

మరో వైరస్‌ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు గర్తింపు

అంబులెన్సుల దందా.. 40 కి.మీట‌ర్ల‌కు రూ.17 వేలు

న్యూయార్క్‌ కన్నా ముంబైలో రెట్టింపు!

గర్భిణులకు 2-డీజీ వద్దు

రాందేవ్‌ బాబా దేశ వ్యతిరేకి : ఐఎంఏ

ఎస్పీఎస్ఎన్ లో 11 జూన్ నుంచి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్స్ లైవ్..

నో డౌట్‌: ఇప్ప‌ట్లో లీట‌ర్ పెట్రోల్ రూ.100 త‌గ్గ‌దు..!!

విదేశీ వ్యాక్సిన్ల‌కు ఆ ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి సిద్ధం!

పాక్‌తో క‌లిసి వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద మిస్సైళ్ల‌ను ప‌రీక్షిస్తున్న చైనా

పాకిస్థాన్‌లో మ్యూజియాలుగా రాజ్‌క‌పూర్‌, దిలీప్‌కుమార్ ఇళ్లు

అతిపెద్ద మాంస విక్రయ సంస్థ‌పై సైబ‌ర్ దాడి..

ఆ ఒక్క క‌రోనా వేరియంటే ఆందోళ‌న క‌లిగిస్తోంది: డ‌బ్ల్యూహెచ్‌వో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిట్ కాయిన్ ముందు ఐదు స‌వాళ్లు.. అవేంటంటే?!

ట్రెండింగ్‌

Advertisement