మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 25, 2020 , 00:13:25

మీ-సేవతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ టై-అప్‌

మీ-సేవతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ టై-అప్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మీ-సేవతో ప్రముఖ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4600 శాఖల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన 500కి పైగా సేవలకు సంబంధించిన అన్ని రకాల చెల్లింపులు జరుపవచ్చును.  బ్యాంక్‌ పేమెంట్‌ గేట్‌వేను, క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా విద్యుత్‌, టెలిఫోన్‌ బిల్లులు, ఆస్తి పన్ను చెల్లింపులు, ఆధార్‌ వివరాలు నమోదు ప్రక్రియ, నివాసం, జనన, మరణ దృవీకరణ పత్రాలకు సంబంధించిన రుసుము చెల్లించేందుకు వీలుంటుంది.


ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఐటీఈ అండ్‌ సీ శాఖ, ఈఎస్‌డీ, ఐఆర్‌ఎస్‌ కమిషనర్‌ జీటీ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ..వినియోగదారులకు కావాల్సిన అన్ని ఆర్థిక సేవలను అందించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు, ఇది వచ్చే రెండేండ్లపాటు బ్యాంక్‌ ఆర్థిక సేవలు అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రం లో మీ-సేవా సర్వీసులకు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొంటున్నదని,  ప్రతిరోజు లక్ష నుంచి 1.5 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. నెలకు రూ.350 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు పారదర్శకంగా సేవ లందించడానికి మీ సేవ కృషి చేస్తున్నదని, 2014లో 1.5 కోట్ల మంది ఉండగా, ప్రస్తు తం 15 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు.


logo
>>>>>>