గురువారం 04 జూన్ 2020
Business - Apr 19, 2020 , 00:20:41

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.7,280 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.7,280 కోట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 15.4 శాతం పెరిగింది. కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ బ్యాంక్‌ ఆకర్షణీయంగా రూ. 7,280.22 కోట్ల లాభాన్ని ఆర్జించడం గమనార్హం. నిరుడు రూ.6,300.81 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ శనివారం స్పష్టం చేసింది. ఈసారి ఆదాయం రూ.38,287.17 కోట్లుగా ఉంటే, పోయినసారి రూ.33,260.48 కోట్లుగా ఉన్నది. 

పురి వారసుడు ఎవరు?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈవో, ఎండీ ఆదిత్యా పురి వారసుడి కోసం ముగ్గురిని ఎంపిక చేశారు. వారి పేర్లను ఆర్బీఐకి పంపించనున్నారు. శశిధర్‌ జగ్దీశన్‌, కైజద్‌ భరుచా, సునీల్‌ గార్గ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌ 26న పురి పదవీ విరమణ పొందుతున్నారు. ఇదిలావుంటే తాజా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఎలాంటి తుది డివిడెండ్‌నూ బ్యాంక్‌ డైరెక్టర్లు సిఫార్సు చేయలేదు. కరోనా ప్రభావంతో మున్ముందు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని బ్యాంక్‌ ఈ సందర్భంగా ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది.


logo