శనివారం 30 మే 2020
Business - May 21, 2020 , 18:53:39

లాక్‌డౌన్‌ వేళ.. బోనస్‌ ఇస్తున్న కంపెనీ ఇది

లాక్‌డౌన్‌ వేళ.. బోనస్‌ ఇస్తున్న కంపెనీ ఇది

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌ విధించడంతో విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యసంస్థలన్నీ మూతపడ్డాయి. ఐటీ సాఫ్ట్‌వేర్‌ సంస్థల తలుపులు తెరుచుకోక 55 రోజులు దాటిపోయాయి. అనేక సంస్థలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి కొన్ని సంస్థలైతే ఉద్యోగాల్లో కొత విధించాయి. లాక్‌డౌన్‌ కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయినవారు.. కొత్త ఉద్యోగాల కోసం వెతుక్కోవడం ప్రారంభించారు. అయితే మిగతా ఐటీ సంస్థలకు భిన్నంగా నడుస్తూ గతేడాది ఇచ్చిన బోనస్‌ హామీని లాక్‌డౌన్‌ సమయంలోనే నెరవేరుస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

బెంగళూరు ప్రధాన కేంద్రంగా వివిధ ప్రాంతాల్లో ఐటీ సేవలు అందిస్తూ దేశంలోనే మూడో అతిపెద్ద ఐటీ రంగ సంస్థగా నిలిచింది హెచ్‌సీఎల్‌. గత ఏడాది ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు బోనస్‌ ఇస్తున్నట్టుగా సంస్థ ప్రకటించింది. ఇదేసమయంలో 15 వేల ఉద్యోగాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు సంస్థ చీఫ్‌ హ్యుమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ వీవీ అప్పారావు తెలిపారు. గత ప్రాజెక్టులేవీ రద్దు కాలేదు కానీ, కొత్త ప్రాజెక్టులు రావడానికి కొంత ఆలస్యం  జరుగుతుందన్నారు. ఈరోజుల 5వేల మంది కొత్త ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎప్పటిమాదిరిగానే జూలైలో రావాల్సిన అప్రైజల్స్‌ కార్యక్రమాలను నోయిడాలోని హెడ్‌క్వార్టర్స్‌  చేపట్టిందని వెల్లడించారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంగానీ, బోనస్‌ను నిలిపివేయడంగానీ చేయడం లేదని అప్పారావు స్పష్టంచేశారు. ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, డబ్ల్యూఎన్‌ఎస్‌ వంటి సంస్థలు ఉద్యోగులకు జీతాలు పెంచలేక ఇబ్బందిపడుతున్న ఈ కీలక సమయంలో హెచ్‌సీఎల్‌ బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించడం పట్ల పలువురు ఐటీరంగ నిపుణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.


logo