శనివారం 30 మే 2020
Business - May 08, 2020 , 10:05:31

హెచ్‌సీఎల్‌ టెక్‌ 1:1 బోనస్‌

హెచ్‌సీఎల్‌ టెక్‌ 1:1 బోనస్‌

  • రూ.2 తుది డివిడెండ్‌ ప్రకటించిన సంస్థ
  • క్యూ4లో 24 శాతం పెరిగిన నికర లాభం

న్యూఢిల్లీ, మే 7: దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో  ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,154 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.2,550 కోట్లతో పోలిస్తే 24.3 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్టు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. గతేడాది రూ.15,990 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం.. ఈసారి 16.3 శాతం వృద్ధితో  రూ.18,587 కోట్లకు చేరినట్టు తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ వాటాదారులకు 1:1 బోనస్‌ షేరును ప్రకటించింది. అలాగే రూ.2 మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రతిపాదించింది. కరోనా వైరస్‌తో స్వల్పకాలంపాటు ఐటీ రంగం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని, క్లయింట్లు నూతన ప్రాజెక్టులు విభేదించడంతో ప్రస్తుతేడాది ఆదాయ, లాభాలపై ప్రభావం చూపనున్నదని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ ప్రెసిడెంట్‌, సీఈవో సీ విజయకుమార్‌ తెలిపారు.  ఈ ఏడాది ఉద్యోగ నియామకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఇప్పటికే ఆఫర్‌ లెటర్‌ ఇచ్చిన 15 వేల మందిని తీసుకోనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఏడాది వేతనాల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కుమార్‌ ప్రకటించారు. 


logo