మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 06, 2020 , 00:07:58

హ్యావెల్స్‌ అల్కలీన్‌ నీటి శుద్ధి యంత్రాలు

హ్యావెల్స్‌ అల్కలీన్‌ నీటి శుద్ధి యంత్రాలు
  • ప్రారంభ ధర రూ.15 వేలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5: ప్రముఖ విద్యుత్‌ పరికరాల తయారీ సంస్థ హ్యావెల్స్‌..రాష్ట్ర మార్కెట్లోకి నూతన శ్రేణి నీటి శుద్ధి యంత్రాలను విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ శశాంక్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ..అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన అల్కలీన్‌ శ్రేణి నీటి శుద్ధి యంత్రాలు రూ.15 వేలు మొదలుకొని రూ.24 వేల మధ్యలో లభించనున్నాయన్నారు. ఈ నూతన యంత్రాల ద్వారా లీటర్‌ నీటిలో సగం వృధా కానుండగా, మిగతా సగం శుద్ధి చేయనున్నదన్నారు.  ప్రతియేటా 6 వేల లీటర్ల నీటిని శుద్ది చేయనున్న ఈ యంత్రాల కోసం వార్షికంగా రూ.5 వేల నుంచి రూ.5,500 ఖర్చు కానున్నట్లు, అంటే లీటర్‌కు రూపాయి కంటే తక్కువ ఖర్చు అవుతుందన్నారు. ప్రస్తుతం నాలుగు రకాల అల్కలైన్‌ నీటి శుద్ధి  యంత్రాలు మార్కెట్లో లభిస్తుండగా, త్వరలో మరో రెండు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.  రూ.6 వేల కోట్ల స్థాయిలో ఉన్న నీటి శుద్ధి యంత్రాల మార్కెట్లో రూ.4,500 కోట్లు సంఘటిత రంగానికి చెందినది కాగా, మరో రూ.2 వేల కోట్లు అసంఘటిత రంగ సంస్థలదని ఆయన పేర్కొన్నారు. logo
>>>>>>