మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 22, 2020 , 23:51:06

నయా టెక్నాలజీతో హైయర్‌

నయా టెక్నాలజీతో హైయర్‌
  • మార్కెట్‌లోకి కొత్త రకం ఉత్పత్తులు

మాదాపూర్‌ (హైదరాబాద్‌), ఫిబ్రవరి 22: ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హైయర్‌.. మార్కెట్‌లోకి సరికొత్త టెక్నాలజీతో నూతన రకం ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. శనివారం ఇక్కడ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైయర్‌ అప్లియెన్సెస్‌ ఇండియా అధ్యక్షుడు ఎరిక్‌ బ్రగాంజా, సీనియర్‌ ఉపాధ్యక్షుడు సతీష్‌ మాట్లాడారు. తమ వినియోగదారులకు నయా టెక్నాలజీ, నాణ్యమైన సేవలను అందించడంలో వెనక్కి తగ్గబోమన్నారు. కస్టమర్లను ఆకట్టుకునే రీతిలో సరికొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామన్నారు. 


రిఫ్రిజిరేటర్‌, టెలివిజన్లు, మైక్రోవేవ్‌ అవెన్స్‌, డీప్‌ ఫ్రీజర్లు, వాటర్‌ హీటర్లు, ఏయిర్‌ కండీషనర్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి సరికొత్త రూపంలో తీసుకువస్తున్నట్లు తెలిపారు. కాగా, దేశీయంగా హైయర్‌కు 20 వేల మంది డీలర్లుండగా, వీరిలో 2 వేల మంది కంపెనీ డీలర్లని చెప్పారు. దేశవ్యాప్తంగా 19 వేలకుపైగా పిన్‌కోడ్‌ ప్రాంతాల్లో హైయర్‌ ఎక్స్‌క్లూజివ్‌ సర్వీసులను అందిస్తున్నదని వివరించారు.


logo
>>>>>>