శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Mar 09, 2020 , 00:41:14

గల్ఫ్‌ షేర్లు ఢమాల్‌

గల్ఫ్‌ షేర్లు ఢమాల్‌

గల్ఫ్‌ దేశాల స్టాక్‌ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. ఇంధన ఉత్పత్తి తగ్గుదలకు సంబంధించి ఒపెక్‌, సభ్యదేశాల మధ్య అధికారిక ఒప్పందం కుదరకపోవడంతో ఆదివారం సౌదీ స్టాకులు కుప్పకూలాయి. శుక్రవారం బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర నాలుగేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో సౌదీ అరేబియా స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమైన నిమిషంలోనే 7.7 శాతం పతనం చెందాయి. వీటిలో ఇంధన దిగ్గజం సౌదీ అరామ్‌కో ఐపీవో ధర 32 రియాల్స్‌ (8.5 డాలర్లు) నుంచి 31.98 రియాల్స్‌కు పడిపోయింది. దుబాయి ఫైనాన్షియల్‌ మార్కెట్‌ 8.5 శాతం తగ్గగా, అబుదాబీ 7 శాతం, ఖతార్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 3.5 శాతం, కువైట్‌ బోర్స్‌ రెండు శాతం కోల్పోయాయి. 
logo