గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 12, 2020 , 23:49:31

ఆకట్టుకున్న గల్ఫ్‌ ఆయిల్‌

ఆకట్టుకున్న గల్ఫ్‌ ఆయిల్‌

ముంబై, ఫిబ్రవరి 12: హిందుజా గ్రూపునకు చెందిన ఇంధన విక్రయ సంస్థ గల్ఫ్‌ ఆయిల్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలలకుగాను సంస్థ రూ.55.87 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.49.79 కోట్లతో పోలిస్తే 12.21 శాతం అధికమైంది. ఆదాయంలో మాత్రం సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలానికిగాను రూ.462.02 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ..గత త్రైమాసికానికిగాను రూ.421.86 కోట్లకు పడిపోయింది. నికరంగా 8.69 శాతం తగ్గినట్లు అయిందని పేర్కొంది.  
logo
>>>>>>