శుక్రవారం 05 జూన్ 2020
Business - May 07, 2020 , 01:42:15

జీఎస్టీ రిటర్నుల గడువు పెంపు

 జీఎస్టీ రిటర్నుల గడువు పెంపు

  • సెప్టెంబర్‌ వరకు పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ, మే 6: జీఎస్టీ రిటర్నుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను జీఎస్టీ రిటర్నులను సెప్టెంబర్‌ 2020 వరకు దాఖలు చేసుకోవచ్చును. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా ఈవై ట్యాక్స్‌ పార్టనర్‌ అభిషేక్‌ జైన్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా పారిశ్రామిక వర్గాలు జూన్‌ చివరి లోగా జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయడం అంత సులువుకాదని, దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పెంచడంతో ఈ వర్గాలకు భారీ ఊరట లభించినట్లు అయిందన్నారు. మార్చి 25న ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించినది తెలిసిందే. కాగా, నెలవారి జీఎస్టీ రిటర్నులకు అవసరమైన డిజిటల్‌ సంతకం, పన్ను చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఆలస్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రానిక్‌ వెరిఫికేషన్‌ కోడ్‌(ఈవీసీ) ద్వారా జూన్‌ 30 లోగా వీటిని దృవీకరించే అవకాశం కల్పించింది.


logo