e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News కొవిడ్ టీకాల‌పై జీరో టాక్స్ సాధ్య‌మేనా?.. రేపు జీఎస్టీ కౌన్సిల్?!

కొవిడ్ టీకాల‌పై జీరో టాక్స్ సాధ్య‌మేనా?.. రేపు జీఎస్టీ కౌన్సిల్?!

కొవిడ్ టీకాల‌పై జీరో టాక్స్ సాధ్య‌మేనా?.. రేపు జీఎస్టీ కౌన్సిల్?!

న్యూఢిల్లీ: కొవిడ్-వ్యాక్సిన్లు, ఔష‌ధాలు, ఔష‌ధ ప‌రిక‌రాల‌పై జీఎస్టీ త‌గ్గింపు, ఆదాయం త‌గ్గిన రాష్ట్రాల‌కు ప‌రిహారం చెల్లింపు త‌దిత‌ర అంశాల‌పై జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం శుక్ర‌వారం జ‌రుగ‌నున్న‌ది. జీఎస్టీ విధి విధానాల‌ను ఖ‌రారు చేసే జీఎస్టీ కౌన్సిల్ భేటీకి ఎనిమిది రాష్ట్రాల నుంచి బీజేపీయేత‌ర ఆర్థిక మంత్రులు హాజ‌రు కానుండ‌టం ఇదే తొలిసారి.

ఈ నేప‌థ్యంలో జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో రాజ‌స్థాన్‌, పంజాబ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌, కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సంయుక్త వ్యూహాన్ని ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. క‌రోనా చికిత్స‌కు అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, ప‌రికరాల‌పై జీరో టాక్స్ కోసం ప‌ట్టు బ‌ట్టొచ్చు.

జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతుంది. దాదాపు ఎనిమిది నెల‌ల త‌ర్వాత ఈ భేటీ జ‌రుగుతున్న‌ది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు భేటీకి హాజ‌ర‌వుతారు.

ప‌న్ను రేట్ల త‌గ్గింపుతోపాటు 2017లో వ్యాట్ స్థానంలో జీఎస్టీ అమ‌లులోకి వ‌చ్చిన‌ప్పుడు ప‌రిహారం చెల్లిస్తామ‌ని రాష్ట్రాల‌కు కేంద్రం హామీ ఇచ్చింది. దాని ప్ర‌కారం రాష్ట్రాల‌కు రూ.2.69 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు కేంద్రం ప‌రిహారం చెల్లించాల్సిన అవ‌స‌రం ఉంది.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాధికారుల‌తో ఏర్పాటైన జీఎస్టీ రేట్ల ఫిట్‌మెంట్ క‌మిటీ నివేదిక కూడా చ‌ర్చ‌కు రానున్న‌ది. కొవిడ్ వ్యాక్సిన్లు, ఔష‌ధాలు, ఇత‌ర వైద్య ప‌రిక‌రాల‌పై జీరో రేట్ ట్యాక్స్‌, ప‌న్ను మిన‌హాయింపు త‌దిత‌ర అంశాల‌పై ఫిట్‌మెంట్ క‌మిటీ నివేదిక ఇచ్చింది.

కొవిడ్‌-19 వ్యాక్సిన్లు, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌పై ప‌న్ను త‌గ్గించే అవ‌కాశాల‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కొట్టిపారేశారు. వాటిపై ప‌న్ను త‌గ్గిస్తే, ఔష‌ధాల ధ‌ర‌లు పెరిగిపోతాయ‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం వ్యాక్సిన్ల దేశీయ స‌ర‌ఫ‌రా, విదేశాల నుంచి వ్యాక్సిన్ల‌పై ఐదు శాతం జీఎస్టీ, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లపై 12 శాతం లెవీని కేంద్ంర వ‌సూలు చేస్తున్న‌ది. శానిట‌రీ నాప్‌కిన్ల‌పై 12 శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా మిన‌హాయించాల‌ని వివిధ మ‌హిళా సంఘాలు 2018లో డిమాండ్ చేశాయి.

ఇవి కూడా చ‌ద‌వండి:

నోట్లు ముద్రించడమే మార్గం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

ప్ర‌పంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం ప‌దిలం

వ్యాక్సినేష‌న్ తోనే ఎకాన‌మీపై మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ కు చెక్ : ఆర్బీఐ

వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!

30 రోజుల్లో వాపస్‌

హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో రేపు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

ఐటీ కొత్త రూల్స్‌.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ట్విట్ట‌ర్ సంస్థ‌

మామిడి పండ్లు తిన‌గానే ఆ ఐదింటి జోలికి అస‌లే పోవ‌ద్దు..!

నన్నెవ‌రూ అరెస్ట్ చేయ‌లేరు : రాందేవ్ బాబా

యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ట్రయల్స్‌కు జైడస్‌ దరఖాస్తు

భార‌తీయ ఐటీ చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం : గూగుల్ సీఈవో

12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్‌ సురక్షితం : ఫైజర్‌

దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు

మెహుల్‌ చోక్సీ దొరికాడు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్ టీకాల‌పై జీరో టాక్స్ సాధ్య‌మేనా?.. రేపు జీఎస్టీ కౌన్సిల్?!

ట్రెండింగ్‌

Advertisement