మంగళవారం 26 మే 2020
Business - Apr 18, 2020 , 03:34:23

రిఫండ్ల చెల్లింపులు భళా!

రిఫండ్ల చెల్లింపులు భళా!

  • జీఎస్టీ రూ.5,575 కోట్లు, ఐటీ రూ.5 వేల కోట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: జీఎస్టీ రిఫండ్ల చెల్లింపులు భారీగా పెరిగాయి. మార్చి 30 నుంచి ఇప్పటి వరకు రూ.5,575 కోట్ల విలువైన జీఎస్టీ రిఫండ్ల చెల్లింపులు జరిపినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఐసీ) శుక్రవారం తాజాగా వెల్లడించింది. గతవారంలోనే 7,873 రిఫండ్లకు సంబంధించి రూ.3,854 కోట్లను క్లెయిం చేసినట్లు తెలిపింది. కమరోవైపు గత పది రోజుల్లో రూ.5,204 కోట్ల ఐటీ రిఫండ్ల చెల్లింపులు జరిపినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) తెలిపింది. కరోనా వైరస్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు ఆర్థికంగా భరోసాను ఇచ్చే ఉద్దేశంలో భాగంగా రిఫండ్‌ చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసినట్లు సీబీఐసీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 30 నుంచి ఇప్పటి వరకు 12,923 రిఫండ్‌ దరఖాస్తులను ప్రాసెసింగ్‌ చేసినట్లు తెలిపింది.  అలాగే ఈ నెల 8 నుంచి ఇప్పటి వరకు 8.2 లక్షల ట్యాక్స్‌ రిఫండ్లను సెటిల్‌ చేసినట్లు వెల్లడించింది.


logo