e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home బిజినెస్ రూ.80కే… 800 కిలోమీటర్లు

రూ.80కే… 800 కిలోమీటర్లు

హైదరాబాద్‌, జూన్‌ 28: హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ గ్రావ్టన్‌ మోటర్స్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌నే విప్లవాత్మకంగా పరిచయం చేసింది. క్వాంటా పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ బైక్‌&కేవలం రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజి ఇవ్వగలదని కంపెనీ సోమవారం వెల్లడించింది. ప్రమోషనల్‌ ఆఫర్‌గా ధరను రూ.99,000గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వపు ‘గో ఎలక్ట్రిక్‌’ ప్లాట్‌ఫామ్‌లో క్వాంటాను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపచేసినట్లు గ్రావ్టన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురామ్‌ పాకా తెలిపారు.

  • రూ.80కే& 800 కిలోమీటర్ల ప్రయాణం
  • బీఎల్‌డీసీ మోటర్‌తో గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగం
  • ఒక్కసారి ఛార్జ్‌చేస్తే 150 కిలోమీటర్ల ప్రయాణం, 320 కిలోమీటర్ల వరకూ పెరిగే అవకాశం
  • ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మోడ్‌లో 90 నిముషాల్లో బ్యాటరీ ఛార్జింగ్‌
  • బ్యాటరీకి 5 ఏండ్ల వారెంటీ
  • రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, మ్యాపింగ్‌ సర్వీస్‌ స్టేషన్స్‌,రిమోట్‌ లాక్‌/ఆన్‌లాక్‌ ఫీచర్లతో స్మార్ట్‌ యాప్‌
  • మూడు రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana