మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jul 23, 2020 , 01:20:09

భారత్‌కు పెను నష్టం: డీబీఎస్‌

భారత్‌కు పెను నష్టం: డీబీఎస్‌

  జీడీపీ -6 శాతానికి: డీబీఎస్‌

ముంబై: భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ తీవ్రంగా దెబ్బతీసిందని సింగపూర్‌ బ్రోకరేజీ సంస్థ డీబీఎస్‌ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) దేశ జీడీపీ మైనస్‌ 6 శాతానికి పడిపోవచ్చని సంస్థ ఆర్థికవేత్త రాధిక రావు అంచనా వేశారు. ఇంతకుముందు అంచనా మైనస్‌ 4.8 శాతమే. అయితే దేశానికి ఆర్థికంగా బలమైన రాష్ర్టాల్లో వైరస్‌ విజృంభిస్తున్నదని, అందుకే జీడీపీ మరింత పడిపోవచ్చని బుధవారం అభిప్రాయపడ్డారు. ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశాల్లేవని కూడా తాజా నివేదికలో ఆమె చెప్పా రు. కొన్ని రాష్ర్టాల్లో ఇంకా లాక్‌డౌన్‌ పరిస్థితులు అమలవుతుండటం కూడా దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోనివ్వడం లేదన్నారు. 


logo