Granules nod Health Canada | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా తయారు చేసే కీళ్ల నొప్పులు/ వాపుల నివారణ ఔషధం ఆసిటమైనోఫెన్ ఓటీసీ టాబ్లెట్స్ (650 ఎంజీ) మార్కెటింగ్‌కు కెనడా నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు కెనడా ఆరోగ్యశాఖ నుంచి అనుమతి లభించిందని గ్రాన్యూల్స్ ఇండియా తెలిపింది. దీంతో కెనడాలో రెండు ఔషధాల మార్కెటింగ్‌కు గ్రాన్యూల్స్‌కు అనుమతి లభించినట్లయింది. హైదరాబాద్‌లోని గాజిల్లాపూర్లో గ్రాన్యూల్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో ఈ టాబ్లెట్లు తయారవుతాయి.
గ్రాన్యూల్స్ యూఎస్ఏ అండ్ గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియాంక చిగురుపాటి ఈ సందర్భంగా స్పందిస్తూ.. మార్కెటింగ్ కోసం తాము దరఖాస్తు చేసిన 8 నెలల్లోనే కెనడా నుంచి అనుమతి పొందాం అని చెప్పారు. గ్లోబల్ మార్కెటింగ్‌లో విస్తరణ దిశగా ఇది ఒక ముందడుగు అని అభివర్ణించారు. త్వరలో కెనడా మార్కెట్లో దీన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.