ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 07, 2021 , 18:20:24

సీత‌మ్మ తాంబూలాలిచ్చేశారు.. ఆర్బీఐతో క‌లిసి బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌

సీత‌మ్మ తాంబూలాలిచ్చేశారు.. ఆర్బీఐతో క‌లిసి బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌

ముంబై: వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌పై భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ)తో క‌లిసి ప‌ని చేస్తామ‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. అయితే, ఏయే బ్యాంకుల్లో ప్ర‌భుత్వ వాటాల‌ను ఉప‌సంహ‌రించాల‌న్న విష‌య‌మై ప్ర‌భుత్వం వ‌ద్ద ప్ర‌ణాళిక‌ల్లేవ‌ని ఆదివారం మీడియాకు చెప్పారు.

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను గ‌త సోమ‌వారం పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పిస్తూ నిర్మ‌లా సీతారామ‌న్.. రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రిస్తామ‌ని, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఐపీవోకు వెళ‌తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌ను బ్యాంకు ఉద్యోగ సంఘాల నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తుండ‌టం గ‌మ‌నార్హం. 

ఏయే బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించాల‌న్న విష‌య‌మై క‌స‌ర‌త్తు ప్రారంభించామ‌ని, తాను ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టికీ.. ఆర్బీఐతో క‌లిసి ప‌ని చేయ‌నున్న‌ట్లు తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌కు అంతా సిద్ధ‌మైన‌ప్పుడు ప్ర‌భుత్వం వివ‌రాల‌ను వెల్ల‌డిస్తుంద‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆమె చెప్పారు. కానీ ఏయే బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించాల‌న్న విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి నిరాక‌రించారు.

నేష‌న‌ల్ అసెట్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ (ఏఆర్సీ)కి ప్ర‌భుత్వం నుంచి కొంత గ్యారంటీ కావాల‌ని, అయితే, బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం సంబంధిత బ్యాంకుల నుంచే ప‌రిష్కారం రావాల్సి ఉంద‌న్నారు. నేష‌‌న‌ల్ అసెట్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ (ఏఆర్సీ)కి వివిధ బ్యాంకుల మొండి బాకీల త‌ర‌లింపువ‌ల్ల ఉప‌యోగం లేద‌న్నారు. బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (బీఐసీ) ప్ర‌తిపాద‌నేదీ లేద‌న్నారు. అటువంటి చ‌ర్చ త‌మ శాఖ‌లో జ‌రుగ‌లేద‌న్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo