శనివారం 30 మే 2020
Business - May 09, 2020 , 01:15:59

రుణ లక్ష్యాన్ని పెంచుకొన్న కేంద్రం

రుణ లక్ష్యాన్ని పెంచుకొన్న కేంద్రం

న్యూఢిల్లీ, మే 8: ఆర్థిక రంగంపై కరోనా సంక్షోభ ప్రభావంతో ఆదాయానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రుణ సమీకరణ లక్ష్యాన్ని భారీగా రూ.12 లక్షల కోట్లకు పెంచుకొన్నది. వారంవారీగా సేకరించే రుణాల లక్ష్యాన్ని కూడా రూ.21 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు పెంచినట్టు కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో రూ.7.80 లక్షల కోట్లుగా ఉన్న రుణ సమీకరణ అంచనాలను ప్రస్తుతం రూ.12 లక్షల కోట్లకు పెంచుతున్నామని, కరోనా కాటుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో రుణసమీకరణ అంచనాలను పెంచకతప్పలేదని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఆదాయానికి, వ్యయానికి మధ్య లోటును భర్తీచేసుకొనేందుకు మార్కెట్‌ నుంచి ప్రభుత్వం రుణాలను సేకరిస్తుంది.logo