సోమవారం 01 జూన్ 2020
Business - May 10, 2020 , 12:37:54

సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు క్రెడిట్ గ్యారంటీ స్కీం

సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు క్రెడిట్ గ్యారంటీ స్కీం

న్యూఢిల్లీ: క‌రోనావైర‌స్‌తో దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు ఉద్దీప‌న ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ప్యాకేజీలు ప్ర‌క‌టిస్తోంది. దీనిలో భాగంగా కార్మికుల వేత‌నాలు చెల్లించేందుకు సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు (ఎంఎస్ఎంఈలకు) బ్యాంకులు అద‌నంగా 10 నుంచి 15 శాతం వ‌ర్కింగ్ ముల‌ధ‌నాన్ని అందించేందుకు, క్రెడిట్ గ్యారంటీ ప‌థ‌కం తీసుకువ‌చ్చేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తుంది. ప్ర‌స్తుతం బ్యాంకులు వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ ప‌రిమితి ఆధారంగా 10 శాతం అద‌న‌పు రుణాన్ని అందిస్తున్నాయి. ఈ రుణాన్ని పెంచేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. 

లాక్‌డౌన్ కార‌ణంగా దేశంలో చాలా ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. గ‌త రెండు నెల‌లుగా ఎటువంటి ప‌నులు జ‌ర‌గ‌లేదు. దీంతో ఎంఎస్ఎంఈలకు కార్మికుల‌ వేత‌నాలు చెల్లించేందుకు క‌ష్టంగా మారింది. వారికి ఆర్థిక స‌హాయం చేయ‌డానికి ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది. వ్య‌వ‌సాయ రంగం త‌రువాత దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎంఎస్ఎంఈ రంగం ఉంది. ప్ర‌తిపాదిత క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ద్వారా బ్యాంకులు మ‌ద్ద‌తు ఇస్తాయి. ఏదైనా రుణ‌గ్ర‌హిత డిఫాల్ట్ అయిన‌ప్పుడు రుణ‌దాత‌ల డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది.

 ప‌రిశ్ర‌మ‌ల మ‌నుగ‌డ కోసం డ‌బ్బులు అందించ‌డానికి కోవిడ్‌-19 ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ పెసిలిటీ కింద లాక్‌డౌన్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి బ్యాంకులు ఎంఎస్ఎంఈ రంగానికి, కార్పోరేట్ల‌కు రూ.42,000 కోట్ల రుణం మంజూరు చేశాయి. ఎంఎస్ఎంఈ రంగం జీడీపీలో 28శాతం, 40శాతం ఎగుమ‌తుల‌కు దోహ‌దం చేస్తుండ‌గా, 11 కోట్ల మందికి ఉపాధి క‌ల్పిస్తుంది. ఆర్‌బీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఎంఎస్ఎంఈలు, కార్పోరేట్లు మూడు నెల‌ల మారిటోరియం కూడా పొందాయి. 





 


logo