వాటాదారులుగా మారనున్న పాలసీదారులు

న్యూఢిల్లీ : ఎల్ఐసీ ఐపీఓకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐపీఓలో ఎల్ఐసీ పాలసీదారులకు పది శాతం వాటాలను కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు కొన్ని షేర్లను రిజర్వ్ చేయాలని చట్టంలో పొందుపరిచామని, పాలసీదారులు వాటాదారులయ్యే అవకాశం కల్పించామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (డీఐపీఏఎం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ఎల్ఐసీ ఐపీఓలో పది శాతం పాలసీదారులకు కేటాయించవచ్చని ఆయన వెల్లడించారు.
2022లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ 1.75 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకున్న క్రమంలో తదుపరి ఏడాది ఎల్ఐసీ ఐపీఓ జారీ అవుతుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు కొవిడ్-19 మహమ్మారితో గత ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరుకోలేదని పాండే పేర్కొన్నారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరిస్తామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లలో లిస్టవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..