బుధవారం 03 జూన్ 2020
Business - May 10, 2020 , 14:58:09

పరిశ్రమలు తిరిగి తెరువడానికి మార్గదర్శకాలు

 పరిశ్రమలు తిరిగి తెరువడానికి మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో విషవాయువు లీకై 11 మంది కార్మికులు చనిపోయిన ఘటన దృష్ట్యా.. లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమలను తిరిగి తెరువడానికి నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ అథారిటీ (ఎన్డీఎంఏ) మార్గదర్శకాలను విడుదల చేసింది. దాదాపు 50 రోజులకు పైగా లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలన్నీ మూసివున్నాయి. వీటిని ఉన్నఫలంగా ప్రారంభిస్తే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదమున్నందున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్డీఎంఏ సూచించింది. పరిశ్రమలను తిరిగి ప్రారంభించాక తొలి వారాన్ని ట్రయల్‌ రన్‌గా నిర్వహించాలి. అన్నిరకాల భద్రతా చర్యలు చేపట్టాలి. ఒకేసారి పెద్ద లక్ష్యాన్ని చేరుకొనేలా టార్గెట్‌ పెట్టుకోవద్దు అని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. చాలాకాలంపాటు పరిశ్రమలు మూసివున్నందున ఆపరేషన్స్‌లో కొన్ని సమస్యలు వస్తాయని హెచ్చరించింది. పరిశ్రమలను తిరిగి ప్రారంభించే ముందు కార్మికులకు భద్రతా చర్యలు ఎలా  ఉన్నాయో గమనించాలి. అలాగే, ఉత్సత్తి సౌలభ్యాలు, పైపులైన్లు, వాల్వులు వంటి కీలకమైనవి సక్రమంగానే పని చేస్తున్నాయని రూఢీ చేసుకోవాలి. విషపూరిత వాయువులను వెలువరించే రసాయనాలను జాగ్రత్తగా  గమనిస్తూ ఉండాలని ఎన్డీఎంఏ సూచించింది. 


logo