బుధవారం 03 జూన్ 2020
Business - May 20, 2020 , 17:12:11

వయ వందన పథకం పొడిగింపు

వయ వందన పథకం పొడిగింపు

న్యూఢిల్లీ: వృద్ధులకు ఆసరగా నిలచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై)ను మరో మూడేండ్ల పాటు కొనసాగించనున్నారు. దీనికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఎల్‌ఐసీ ద్వారా కొనసాగించే ఈ పథకం ఇప్పుడు 2023 వరకు అందుబాటులో ఉంటుంది. 60 ఏండ్లు పైబడి లేదా పదవీ విరమణ అనంతరం ఆదాయం గురించి చింత లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 

10 ఏండ్ల కాల పరిమితికి వర్తించే ఈ పథకంలో చేరే వృద్ధులు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం  లేదు. పాలసీని కొనుగోలు చేసేందుకు వయసు ధ్రువీకరణ గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు వివరాలు తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుంది. ఒక్కసారి ప్రీమియం చెల్లించి పాలసీని కొనుగోలు చేసే ఈ పథకంలో వడ్డీని 8.3 శాతంగా నిర్ణయించారు. నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్సన్‌ అందుతుంది. అత్యవసర వైద్య సహాయానికి లేదా అరోగ్య సమస్యలకు డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఈ పాలసీని స్వాధీన పరిచి డబ్బు పొందే వీలుకల్పించారు. జీవిత భాగస్వామి అవసరాలకు కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుంది.


logo