ఆదివారం 29 మార్చి 2020
Business - Mar 22, 2020 , 23:14:27

శానిటైజర్లు చౌక

శానిటైజర్లు చౌక

కేంద్ర ప్రభుత్వ సూచనలకు మేరకు శానిటైజర్ల ధరలను తగ్గించాయి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు.. ఉత్పత్తి సామర్థ్యాన్ని అమాంతం పెంచుకున్నాయి. కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మార్కెట్లో డిమాండ్‌ అధికంగా ఉండటంతో ధరలు తగ్గించి ఉత్పత్తి పెంచాలని కేంద్రం సూచనలకు అనుగుణంగా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. చేతి శానిటైజర్‌ తయారీ సంస్థలైన ఆర్‌బీ, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌, హిమాలయ, డాబర్‌ వంటి సంస్థలు ధరలు తగ్గింపు ఆలోచనలో ఉన్నాయి. అలాగే హైజిన్‌ ప్రొడక్ట్‌లను సైతం తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయడానికి అన్ని  చర్యలు తీసుకుంటున్నాయి.  


logo