గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 28, 2020 , 00:23:22

ఔషధ పరిశ్రమకు ఊతం

ఔషధ పరిశ్రమకు ఊతం

  • బల్క్‌ డ్రగ్స్‌, మెడికల్‌ డివైజ్‌ల తయారీకి కేంద్రం మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ, చైనాతో వైరం నేపథ్యంలో దేశవ్యాప్తంగా బల్క్‌ డ్రగ్స్‌, వైద్య ఉపకరణాల తయారీకి కేంద్ర ప్రభుత్వం ఊతమిచ్చింది. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రిడియెంట్‌ (ఏపీఐ) అభివృద్ధి, మెడికల్‌ డివైజ్‌ పార్కుల ఏర్పాటు కోసం తెచ్చిన నాలుగు పథకాల మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ రూపొందించిన ఈ పథకాలకు ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృక్పథానికి అనుగుణంగా ఔషధ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ఆశయాల మేరకు ఈ పథకాలను తీర్చిదిద్దారు’ అని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ విలేకరుల సమావేశంలో తెలిపారు. 53 రకాల కీలక ఏపీఐలు, పలు మెడికల్‌ డివైజ్‌ల కోసం ప్రస్తుతం భారత్‌ విదేశీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభంతో వీటి లభ్యత కూడా తగ్గిపోవడంతో దేశీయ తయారీపై దృష్టి పెట్టామన్నారు.


logo