గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 01, 2020 , 00:33:25

రాబడి కన్నా ఖర్చే ఎక్కువ

రాబడి కన్నా ఖర్చే ఎక్కువ
  • ఏప్రిల్‌-జనవరిలో కేంద్ర ఆదాయం రూ.12.82 లక్షల కోట్లు
  • వ్యయం రూ.22.86 లక్షల కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ఏప్రిల్‌-జనవరిలో కేంద్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.12.82 లక్షల కోట్లుగా ఉన్నది. వ్యయం రూ.22.68 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. ఈ జనవరి నాటికి రూ.12,82,857 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఓ అధికారిక ప్రకటన తెలియజేసింది. పన్ను ఆదాయం రూ.9,98,037 కోట్లుగా, పన్నేతర ఆదాయం రూ.2,52,083 కోట్లుగా, పెట్టుబడుల ఉపసంహరణసహా రుణేతర మూలధన రాబడి రూ.32,737 కోట్లుగా ఉన్నది. కాగా, పన్నుల ఆదాయంలో రాష్ర్టాలకు ఇవ్వాల్సిన వాటాగా రూ.5,30,735 కోట్లను పంపిణీ చేశారు. ఇక మొత్తం ఖర్చులు రూ.22,68,329 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రెవిన్యూ వ్యయం రూ.20,00,595 కోట్లుగా, మూలధన వ్యయం రూ.2,67,734 కోట్లుగా ఉన్నది. దీంతో జనవరి నాటికి ద్రవ్య లోటు రూ.9.85 లక్షల కోట్లుగా నమోదైంది. 


logo
>>>>>>