భారత్‌కు మరో ఎదురుదెబ్బ

- కెయిర్న్ ఎనర్జీ కేసులోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు
- ఖర్చులు, వడ్డీతోసహా రూ.10,500 కోట్లు చెల్లించాలన్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు
న్యూఢిల్లీ: బహుళజాతి కార్పొరేట్ సంస్థలతో రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ (పేర్కొన్న లావాదేవీపై గతంలో ప్రకటించిన తేదీ నుంచి ఇప్పటిదాకా చెల్లించాల్సిన పన్ను మొత్తం) వివాదాల్లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ గ్రూప్‌తో రూ.22,100 కోట్ల ట్యాక్స్ డిమాండ్ కేసును అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో ఓడిపోయిన కేంద్ర ప్రభుత్వం.. బుధవారం అదే దేశానికి చెందిన కెయిర్న్ ఎనర్జీతో రూ.24, 500 కోట్ల ట్యాక్స్ డిమాండ్ కేసునూ చేజార్చుకున్నది. ఈ డిమాండ్ సరికాదని ముగ్గు రు సభ్యులుగల ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. అంతేగాక కెయిర్న్ ఎనర్జీకి కోర్టు ఖర్చులు, గతంలో జప్తు చేసిన షేర్లు తదితరాలకు సంబంధించి వడ్డీతోసహా దాదాపు రూ.10,500 కోట్లు (1.4 బిలియన్ డాలర్లు) చెల్లించాలని ఆదేశించింది. ట్రిబ్యునల్ సభ్యుల్లో భారత ప్రభుత్వ నామినీ కూడా ఉండగా, భారత్‌కు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్పు వెలువడింది.
అసలు ఏమిటీ కేసు?
2006-07లో అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్ షేర్లను కెయిర్న్ ఇండియాకు కెయిర్న్ యూకే బదిలీ చేసింది. అయితే దీనివల్ల కెయిర్న్ యూకే మూలధన లాభాలను గడించిందంటూ ఐటీ శాఖ రూ.24,500 కోట్ల ట్యాక్స్ డిమాండ్ చేసింది. దీంతో ఈ వ్యవహారం ఆదా యం పన్ను అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ), ఢిల్లీ హైకోర్టులకు చేరింది. ఐటీఏటీలో కెయిర్న్ కేసు ఓడిపోగా, హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది. ఈ క్రమం లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించిన కెయిర్న్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పును పరిశీలిస్తాం. ఆ తర్వాతే స్పందిస్తాం. న్యాయపరంగా మాకున్న మార్గాలను అన్వేషించి త్వరలోనే ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తాం.
-కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్బిట్రేషన్ కోర్టు ఏమన్నది?
కెయిర్న్ వివాదం కేవలం పన్ను సమస్యే కాదన్న కోర్టు.. పెట్టుబడి సంబంధిత అంశమని కూడా చెప్పింది. కాబట్టే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు పరిధిలోకి ఈ కేసు వచ్చిందని స్పష్టం చేసింది. భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం నిబంధనలూ ఈ కేసులో ఉలంఘించబడ్డాయని పేర్కొన్నది. కాగా, 2011లో కెయిర్న్ ఇండియాలోని మెజారిటీ వాటాను వేదాంతకు కెయిర్న్ ఎనర్జీ అమ్మేసింది. కానీ పన్నుల వసూళ్లలో భాగంగా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న దాదాపు 10 శాతం వాటా అలాగే ఉండిపోయింది. అలాగే వేదాంతలోని 5 శాతం కెయిర్న్ వాటానూ కేంద్రం అమ్మేసింది. అంతేగాక రూ.1,140 కోట్ల డివిడెండ్లను జప్తు చేసిన ఐటీ శాఖ.. రూ.1,590 కోట్ల ట్యాక్స్ రిఫండ్‌నూ నిలిపేసింది. ఇవన్నీ తిరిగి చెల్లించాల్సిందే.
తాజావార్తలు
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్‌కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
- వాగుడు తగ్గించుకుని బుద్ధిగా ఉండాలి..లేదంటే,