బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Jan 07, 2021 , 13:47:09

బడ్జెట్‌లో ముందుకు రానున్న కొత్త బ్యాంకు

బడ్జెట్‌లో ముందుకు రానున్న కొత్త బ్యాంకు

న్యూఢిల్లీ : పోర్టులు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి కొత్త బ్యాంకును రూపొందించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఆసియా యొక్క అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుంచి తరిమికొట్టేందుకు ఈ ప్రతిపాదనను పరిగణిలోకి తీసుకుంటున్నంట్లు సమాచారం. ఫిబ్రవరి 1 న సమర్పించే సాధారణ బడ్జెట్‌లో ఈ బ్యాంకు ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

బ్లూమ్‌బర్గ్ తెలిపిన సమాచారం ప్రకారం, ఇన్ఫ్రా ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి ఏర్పాటు చేయనున్న ఈ బ్యాంకు ఈక్విటీ క్యాపిటల్ రూ.1 లక్ష కోట్లతో ప్రారంభం కానున్నది. రూ.2000 కోట్ల కార్పస్‌తో ఉన్న ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌ను కొత్త బ్యాంకులో విలీనం చేయనున్నారు. ఈ బ్యాంకుకు నిధులను తొలుత మొదట్లో ప్రభుత్వం సమకూరుస్తుంది. తర్వాత పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ఈ బ్యాంకును జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి తరహాలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ దీని ప్రధాన పెట్టుబడిదారులలో ఉండనున్నాయి. ఈ ప్రతిపాదనపై చర్చించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కేబినెట్‌ కోసం నోట్స్ తయారు చేయడంలో నిమగ్నమైనట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించలేదు. అంటువ్యాధి కారణంగా విధించిన లాక్‌డౌన్‌కు ఉపశమనం కలిగించడానికి గత ఏడాది ప్రభుత్వం పేదలకు, రైతులకు ప్రత్యక్ష ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఫలితంగా, దేశం ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఉత్పాదక ఆస్తులపై ఖర్చు పెంచే సవాలును ఎదుర్కొంటున్నది. ఆర్థిక వ్యవస్థను పెంచడానికి నేరుగా మౌలిక సదుపాయాలపై ఖర్చు పెంచాలని సిటీ గ్రూప్ ఆర్థికవేత్తలు గత ఏడాది సూచించారు.

ఇన్ఫ్రా ఖర్చు లక్ష్యాన్ని కోల్పోవచ్చు

వచ్చే ఐదేండ్లలో కొత్త రోడ్లు, రైలు మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిలో పెద్ద వాటాగా విదేశీ పెట్టుబడులు ఉండనున్నాయి. కానీ, ఆర్థిక క్షీణత కారణంగా ప్రభుత్వం లక్ష్యాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. 2020 మార్చి వరకు గత రెండేండ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.1.7 లక్షల కోట్లను ప్రభుత్వం చేర్చింది. అయితే, పెరుగుతున్న బడ్జెట్ లోటు, బలహీనమైన ఆదాయ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో మూలధన ఇన్ఫ్యూషన్‌కు బ్రేక్ వేసింది.

ఇవి కూడా చదవండి..

భూమి వేగంగా తిరుగుతోంది.. ఎందుకంటే..?

మెడల్ని విరిచేసిన తుమ్ము.. ఏమైందంటే..?

తిరిగి ఇందిరమ్మ చేతిలోకి అధికారం

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo