గురువారం 04 జూన్ 2020
Business - Apr 16, 2020 , 00:47:58

అమెరికా ప్రగతి కోసం..

అమెరికా ప్రగతి కోసం..

  • ఆర్థిక పునరుద్ధరణ పారిశ్రామిక బృందాల్లో  
  • నాదెళ్ల, పిచాయ్‌ మరో నలుగురు భారతీయులు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 15: కరోనా వైరస్‌ ధాటికి కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశీయ కంపెనీలకు చెందిన 200 మందికిపైగా కార్పొరేట్‌ దిగ్గజాలతో గ్రేట్‌ అమెరికన్‌ ఆర్థిక పునరుద్ధరణ పారిశ్రామిక బృందాలను ప్రకటించారు. వీటిలో ఆరుగురు భారత సంతతివారుండగా.. వారిలో అల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు. ఐబీఎం సీఈవో అర్వింద్‌ కృష్ణ, మైక్రాన్‌ టెక్నాలజీ సీఈవో సంజయ్‌ మెహ్రోత్రా, పెర్నాడ్‌ రికార్డ్‌ చైర్మన్‌, సీఈవో అన్‌ ముఖర్జీ, మాస్టర్‌ కార్డ్‌ అధ్యక్షుడు, సీఈవో అజయ్‌ బంగాలకూ చోటు దక్కింది. యాపిల్‌, ఒరాకిల్‌, ఫేస్‌బుక్‌, టెస్లా, ఫోర్డ్‌, ఫియట్‌ కంపెనీల సారథులూ బృందాల్లో ఉన్నారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి వీరంతా ట్రంప్‌కు సలహాలు, సిఫార్సులు చేయనున్నారు. 


logo