బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 13, 2020 , 16:42:38

భారత్ లో రూ.75 వేల కోట్ల గూగుల్ పెట్టుబడులు

భారత్ లో రూ.75 వేల కోట్ల గూగుల్ పెట్టుబడులు

న్యూఢిల్లీ : ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్.. వచ్చే ఐదు-ఏడు సంవత్సరాలలో భారతదేశంలో 10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 75,000 కోట్లు )పెట్టుబడి పెట్టనున్నది. గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని సోమవారం ప్రకటించారు. ఈ మొత్తం హిందీ, తమిళం, పంజాబీ సహా ప్రతి భారతీయ భాషలోని సమాచారాన్ని ప్రతి దేశస్థుడికి తెలియజేయడానికి ఉపయోగించనున్నారు. ఇదేకాకుండా, ఈ నిధులు భారత ప్రజల అవసరాలను తీర్చడానికి కొత్త ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

గూగుల్ ఫర్ ఇండియా ప్రోగ్రాంను ఉద్దేశించి పిచాయ్ మాట్లాడుతూ.. 'గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్' ప్రకటించడం ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేండ్లలో గూగుల్ రూ.75,000 కోట్ల భారతదేశంలో పెట్టుబడులు పెట్టనుందని పిచాయ్ చెప్పారు. ఈ పెట్టుబడి నిర్ణయం భారతదేశం యొక్క భవిష్యత్, దాని డిజిటల్ ఎకానమీపై సంస్థ యొక్క విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ పెట్టుబడులు భారతదేశ డిజిటలైజేషన్‌కు సంబంధించిన నాలుగు ముఖ్య అంశాలపై దృష్టి సారిస్తుందని పిచాయ్ చెప్పారు. 

ఈ నాలుగు ముఖ్యమైన అంశాలు:

ప్రతి భారతీయుడికి వారి స్వంత భాషలో సమాచారం అందించడం, భారతదేశం యొక్క స్వంత అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం, డిజిటల్ పరివర్తన ప్రకారం వ్యాపారాలను సాధికారపరచడం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం వంటి రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు వాడకం ఉన్నాయి.



logo