e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News క్రిప్టోల‌కు లైన్ క్లియ‌ర్‌.. అడ్వ‌ర్టైజింగ్‌కు గూగుల్‌ ఓకే!

క్రిప్టోల‌కు లైన్ క్లియ‌ర్‌.. అడ్వ‌ర్టైజింగ్‌కు గూగుల్‌ ఓకే!

google

న్యూఢిల్లీ: క్రిప్టో క‌రెన్సీల‌పై సెర్చింజ‌న్ గూగుల్ త‌న విధానాన్ని స్వ‌ల్పంగా మార్చుకున్న‌ది. ఇక నుంచి త‌మ నెట్‌వ‌ర్క్‌లో క్రిప్టో క‌రెన్సీల అడ్వ‌ర్టైజ్‌మెంట్ చేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఆగ‌స్టు నుంచి ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌స్తుంది. క్రిప్టో క‌రెన్సీ కంపెనీలు త‌మ వేదిక‌ల‌పై వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు జారీ చేయ‌డానికి నిషేధం విధిస్తూ 2018లో గూగుల్ ఆదేశాలు జారీ చేసింది.

త‌ర్వాత‌ క్రిప్టో క‌రెన్సీ ఏజెన్సీల‌తోపాటు క్రిప్టో కంపెనీల‌పై త‌న వైఖ‌రిని మార్చేసుకున్న‌ది సెర్చింజ‌న్‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల ప్ర‌భుత్వాల నుంచి నియంత్ర‌ణ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న త‌రుణంలో గూగుల్ నిర్ణ‌యం క్రిప్టో క‌రెన్సీల‌కు రిలీఫ్‌నిస్తున్న‌ది.

క్రిప్టోల‌కు లైన్ క్లియ‌ర్‌.. అడ్వ‌ర్టైజింగ్‌కు  గూగుల్‌ ఓకే!

నియ‌మ‌, నిబంధ‌న‌లు, చ‌ట్టాల‌కు అనుగుణంగా క్రిప్టో క‌రెన్సీ వాలెట్లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇప్ప‌టికైతే అమెరికాలో మాత్ర‌మే గూగుల్‌ వేదిక‌ల‌పై క్రిప్టో క‌రెన్సీల అడ్వ‌ర్టైజింగ్‌ల‌కు అనుమ‌తినిస్తున్న‌ట్లు బ్లాగ్‌ రాసుకుంది. తదుప‌రి ప్ర‌పంచ వ్యాప్తంగా అమ‌లు చేస్తామ‌ని తెలిపింది.

అమెరికా ఫైనాన్సియ‌ల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వ‌ర్క్ (ఫిన్‌సెన్‌)కు ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లు లోబ‌డి ఉండాల‌న్న‌ది. ఆగ‌స్టు 3వ‌తేదీ నుంచి త‌మ నిబంధ‌న‌లు అమ‌లులోకి వ‌స్తాయ‌న్న‌ది. క్రిప్టో కంపెనీలు త‌మ పేర్ల‌ను ఫిన్‌సెన్‌, ఫెడ‌ర‌ల్ లేదా స్టేట్ చార్ట‌ర్డ్ బ్యాంకుల్లో న‌మోదు చేసుకోవాల‌ని సూచించింది.

వ‌చ్చేనెల ఎనిమిదో తేదీన ప్ర‌చురిత‌మయ్యే అప్లికేష‌న్‌కు అనుగుణంగా గూగుల్‌తో ధ్రువీక‌ర‌ణ చేసుకోవాల‌ని నూత‌న క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజీలు, వాలెట్ల‌ను అడ్వ‌ర్టైజ‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా విజ్ఞ‌ప్తి చేయాల‌ని కోరింది.

యూఎస్ ఫిన్‌సెన్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా గూగుల్ యాడ్ నెట్‌వ‌ర్క్‌లో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుమ‌తించ‌డంతో క్రిప్టో క‌రెన్సీలు విస్త్రుత సంఖ్య‌లో యూజ‌ర్ల‌కు చేరుతుంద‌ని భావిస్తున్నారు. గూగుల్ నిర్ణ‌యం దానిపై విశ్వ‌స‌నీయ‌త పెరుగుతుందంటున్నారు.

క్రిప్టోల‌కు లైన్ క్లియ‌ర్‌.. అడ్వ‌ర్టైజింగ్‌కు  గూగుల్‌ ఓకే!

గూగుల్ విధాన నిర్ణ‌యంలో మార్పు వ‌ల్ల ఇండియ‌న్ క్రిప్టో క‌రెన్సీ క‌మ్యూనిటీపై ఏ ప్ర‌భావం ప‌డ‌దు. క్రిప్టోల‌పై ఆధార‌ప‌డి యాప్‌లు త‌యారు చేస్తున్న భార‌తీయ సంస్థ‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేవు. నూత‌న పాల‌సీక‌నుగుణంగా స‌ర్టిఫికెట్లు పొందితే యూనోకాయిన్ వంటి వాలెట్లు ల‌బ్ధి పొందొచ్చు.

ఇన్షియ‌ల్ కాయిన్ ఆఫ‌రింగ్స్ (ఐసీవోస్‌), డీ సెంట్ర‌లైజ్డ్ ఫైనాన్స్ (డెఫీ) ట్రేడింగ్ ప్రోటోకాల్స్‌పై వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డానికి మాత్రం గూగుల్ అనుమ‌తించ‌బోమ‌ని తెలిపింది.

క్రిప్టో క‌రెన్సీల క్ర‌య‌, విక్రయాల‌ను, క్రిప్టో క‌రెన్సీలు-దాని అనుబంధ ఉత్ప‌త్తుల ప్రోత్సాహక వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు జారీ చేయ‌డాన్ని అనుమ‌తించ‌దు. డెఫీ నిబంధ‌న‌లు భార‌త క్రిప్టో క‌మ్యూనిటీకి వ్య‌తిరేకంగా ఉన్నాయి.

ఇవి కూడా చ‌దవండి:

ఇంటి పెద్ద‌ను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?

ముకేశ్ అంబానీ గ‌తేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?

ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయ‌ల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథ‌నాల్ పెట్రోల్‌

టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…

2.27 కోట్లు.. ఏప్రిల్‌, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు

లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్‌

రికార్డు గ‌రిష్టానికి స్టాక్ మార్కెట్‌లు

ఇప్పుడు కొన్నా.. 3 నెల‌లకు ఈఎంఐ షురూ.. మ‌హీంద్రా ఆఫ‌ర్‌ !

బిట్ కాయిన్ ముందు ఐదు స‌వాళ్లు.. అవేంటంటే?!

రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో

ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్ర‌ధానమంత్రిగా బెన్నెట్

నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా

Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్​ ఇదే..!

మ‌హేష్ ముంద‌డుగు.. అభిమానుల‌లో ఉత్సాహం

COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్రిప్టోల‌కు లైన్ క్లియ‌ర్‌.. అడ్వ‌ర్టైజింగ్‌కు  గూగుల్‌ ఓకే!

ట్రెండింగ్‌

Advertisement