గురువారం 28 మే 2020
Business - May 11, 2020 , 13:10:03

గూగుల్ క్లౌడ్ ఇండియ‌ ఇంజనీరింగ్ వీపీగా అనిల్ భ‌న్సాలీ

గూగుల్ క్లౌడ్ ఇండియ‌ ఇంజనీరింగ్ వీపీగా అనిల్ భ‌న్సాలీ

న్యూఢిల్లీ:  మైక్రోపాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ అనిల్ భ‌న్సాలీని ఇండియ‌న్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియ‌మించిన‌ట్లు గూగుల్ క్లౌడ్ కంపెనీ ప్ర‌క‌టించింది. దేశంలోని గూగుల్ క్లౌడ్ కోసం సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌ను స‌మ‌న్వ‌యం చేస్తార‌ని తెలిపింది. అనిల్ భ‌న్నాలీ ఇండియాలో మా సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కేల్ పెంచ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తారు. దీని వ‌ల్ల గూగుల్ క్లౌడ్ సేవ‌లను విస్త‌రించ‌డం, అభివృద్ధి చేయ‌డం వంటి సేవ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని గూగుల్ ఇంజ‌నీరింగ్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ జావేరి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ‌లో అనిల్ త‌న 28 ఏండ్ల కెరియ‌ర్‌లో ఎమ్ఎస్ ఆఫీస్‌, ఎమ్ఎస్ విండో డివిజ‌న్‌ల‌లో ప‌నిచేశారు. మైక్రోసాఫ్ట్‌లో అజ్యూర్ క్లౌడ్ డివిజ‌న్ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఇండియ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ టీమ్ లీడ‌ర్‌గా ప‌నిచేశారు. 


logo