గురువారం 04 జూన్ 2020
Business - Apr 21, 2020 , 08:59:20

గూగుల్ మ‌రో వినూత్నం.. త్వ‌ర‌లో డెబిట్ కార్డు !

గూగుల్ మ‌రో వినూత్నం.. త్వ‌ర‌లో డెబిట్ కార్డు !

ప్ర‌ముఖ సెర్చింజ‌న్‌ సంస్థ గూగుల్ మ‌రో వినూత్న సేవ‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ఇంటర్నెట్‌తోపాటు ఆర్థిక సేవల్లోనూ దూసుకెళ్తోన్న గూగుల్‌.. త్వరలో స్మార్ట్‌ డెబిట్‌ కార్డును అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. గూగుల్ పే మొబైల్ వ్యాలెట్‌కు అనుసంధానంగా ఈ డెబిట్ కార్డును తీసుకురానుంది. ఇందుకు గాను సిటీ బ్యాంక్‌తో ఆ సంస్థ ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం. కాగా గూగుల్ కార్డ్ రెండు రూపాల్లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది. ఫిజిక‌ల్‌, వ‌ర్చువ‌ల్ రూపంలో ఈ కార్డును యూజ‌ర్లు వాడుకోవ‌చ్చు. అతి త్వ‌ర‌లోనే బిగ్ స‌ర్‌ప్రైజ్‌గా గూగుల్ ఈ కార్డును లాంచ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే గూగుల్ కార్డ్‌పై గూగుల్ ఇప్ప‌టికీ ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. దీనిపై త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.logo