పేటీఎంకు యాంట్ గుడ్‌బై?

- సంస్థలో తమ వాటా అమ్మకానికి యోచన
- భారత్-చైనా ఉద్రిక్తతలే కారణం
న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల సెగ.. పేటీఎంకు తాకుతున్నట్లు కనిపిస్తున్నది. డ్రాగన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం యాంట్ గ్రూప్.. పేటీఎంలోని తమ వాటాలను ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది మరి. పేటీఎంలో అలీబాబా గ్రూప్‌నకు చెందిన యాంట్‌కు 30 శాతం వాటా ఉన్నది. ప్రస్తుతం దీని విలువ దాదాపు 4.8 బిలియన్ డాలర్లు (రూ.35,400 కోట్లు)గా ఉంటుందని అంచనా. అయితే గల్వాన్‌లో 20 మంది భారత సైనికులను చైనా పొట్టనబెట్టుకోవడంతో ఇరు దేశాల మధ్య వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా వాణిజ్య సంబంధాలపై ఆ ప్రభావం పడుతున్నది. ఈ క్రమంలోనే పేటీఎంలోని వాటాను యాంట్ గ్రూప్ అమ్మేయనుందన్న వార్తలు వస్తున్నాయి.
అలాంటిదేమీ లేదు
మరోవైపు ఈ ఊహాగానాల్లో నిజం లేదని అటు యాంట్ గ్రూప్.. ఇటు పేటీఎం వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ విషయమై ఇరు సంస్థల మధ్య ఎలాంటి చర్చలు ఇప్పటిదాకా జరుగనే లేదని స్పష్టం చేశాయి. కాగా, పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ తదితర ఇతర విదేశీ సంస్థల వాటాలూ ఉండగా, సంస్థ మొత్తం విలువను దాదాపు 16 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
- హీరో@10 కోట్ల క్లబ్
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?