సోమవారం 25 మే 2020
Business - Mar 31, 2020 , 19:15:27

క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన జియో

క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన జియో

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న క్ర‌మంలో టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు ఊరటనిచ్చే పలు చర్యలు చేప‌డుతున్నాయి. తాజాగా రిలయన్స్‌ జియో కూడా ఆ జాబితాలో చేరింది. ఈ మేర‌కు జియో యూజ‌ర్ల‌కు ఏప్రిల్ 17 వ‌ర‌కు 100 నిమిషాల కాల్స్‌, 100 మెసేజ్‌లను ఉచితంగా అందివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ 100 నిమిషాలను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్‌ చేసుకునేందుకు వినియోగించుకోవచ్చునని తెలిపింది.  ప్రీపేయిడ్ వ్యాలిడిటీ అయిపోయినా.. లాక్‌డౌన్ పూర్త‌య్యే వ‌ర‌కు ఇన్‌క‌మింగ్ కాల్స్  స‌దుపాయాన్నిక‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించింది. ఈ అత్య‌వ‌స‌ర కాలంలో తమ బంధువులు, స్నేహితులతో మాట్లాడుకోవ‌టానికి, ఒకవేళ అవసరమైతే హెల్త్‌కేర్‌ సర్వీసులు పొందడానికి ఇది ఉపకరిస్తుందని జియో అభిప్రాయ‌ప‌డింది.logo