న్యూఢిల్లీ: మీరు స్టాక్స్ రిటైల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారా.. విదేశీ సంస్థల్లో షేర్లు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారా.. అయితే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ద్వారా మీ ఆకాంక్షలను నెరవేర్చుకోవచ్చు. ఇండియన్ డీమాట్ ఖాతా ద్వారా గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికన్ జెయింట్ కంపెనీల షేర్లు కొనుగోలు చేయొచ్చు.
ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ యూనిట్.. ఎన్ఎస్ఈ గిఫ్ట్ సిటీ ద్వారా అమెరికాలో లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఫెసిలిటీ లభిస్తుంది. గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో ఎన్ఎస్ఈ గిఫ్ట్ సిటీ పని చేస్తున్నది. మేజర్ అమెరికా టెక్ కంపెనీల్లో మీరు ఫ్రాక్షనల్ ఓనర్షిప్ పొందేందుకు ఎన్ఎస్ఈ గిఫ్ట్ సిటీ చేయూతనిస్తుంది.
అమెరికా కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేయడానికి గిఫ్ట్ సిటీలో బ్రోకరేజీ సంస్థ ద్వారా డిమాట్ ఖాతా తెరవాలి. ఉదాహరణకు ఒక కంపెనీ షేర్ విలువ 100 డాలర్లు ఉంటే.. ఒక డాలర్‌తో 0.1 షేర్ తీసుకోవచ్చు.
అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన మౌలిక వసతులను ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కల్పిస్తోంది. బ్రోకర్స్ రిజిస్ట్రేషన్ కొనసాగుతున్నది. మీ డీమాట్ ఖాతా ద్వారా అమెరికా షేర్లను కొనుగోలు చేసిన తర్వాత ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ తదితర వ్యవహారాలను ఐఎఫ్ఎస్సీ పర్యవేక్షిస్తుంది. లిబరలైజ్డ్ రిమ్మిటెన్స్ స్కీం (ఎల్ఆర్ఎస్) ద్వారా ఆర్బీఐ ఈ ఫెసిలిటీ కల్పిస్తుంది.
ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రతి భారతీయుడు ఏడాదిలో 2.5 లక్షల డాలర్లు (సుమారు రూ.1.86 కోట్లు) విదేశాలకు పంపొచ్చు. ఈ మొత్తాన్ని డెరివేటివ్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు.. ట్రేడింగ్ చేయొద్దు.
చౌకగా అమెరికా సంస్థల షేర్లను భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లను కొనుగోలు చేయొచ్చు. అన్ స్పాన్సర్డ్ డిపాజిటరీ రిసిప్ట్స్ నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే గిఫ్ట్ సిటీలో ఇన్వెస్టర్లు డీమాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది.