బుధవారం 03 జూన్ 2020
Business - Apr 17, 2020 , 08:40:35

ఆరోగ్య, వాహన పాలసీదారులకు శుభవార్త

ఆరోగ్య, వాహన పాలసీదారులకు శుభవార్త

న్యూఢిల్లీ: ఆరోగ్య, వాహన పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా పాలసీల రెన్యూవల్‌ ప్రీమియం చెల్లింపుల గడువును వచ్చే నెల 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. మార్చి 25 నుంచి మే 3 లోగా రెన్యూవల్‌ చేసుకునే పాలసీలకు మాత్రమే ఈ గడువు వర్తించనున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా రెన్యూవల్‌ ప్రీమియం చెల్లింపులు జరుపని వారికి ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్‌ ద్వారా తెలిపింది. మరోవైపు జీవిత బీమా సంబంధించిన పాలసీచెల్లింపులు గడువును కూడా పెంచే అవకాశం ఉన్నది. logo