మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 15, 2021 , 00:54:23

స్టార్టప్‌లకు భలే ప్రోత్సాహకాలు

స్టార్టప్‌లకు భలే ప్రోత్సాహకాలు

దేశంలో ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం.. స్టార్టప్‌లకు పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలోనే పలు ప్రోత్సాహకాలనూ అమలు చేస్తున్నది. 2016లో మోదీ సర్కారు స్టార్టప్‌ ఇండియాను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా మూడేండ్ల ట్యాక్స్‌ హాలీడే ఇచ్చింది. అయితే ఏప్రిల్‌ 1, 2016 నుంచి మార్చి 31, 2022 మధ్యలో ఏర్పాటైన స్టార్టప్‌లకే ఇది వర్తిస్తుంది. నిజానికి ఈ ఏడాది మార్చి ఆఖరు వరకే ఉండగా, ఇటీవలి బడ్జెట్‌లో దీన్ని ఏడాది పొడిగించారు. తొలినాళ్లలో మూలధనం సమీకరణకు ఈ ట్యాక్స్‌ హాలీడే దోహదం చేయగలదన్న విశ్వాసంతోనే 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తున్నారు. అయితే వార్షిక టర్నోవర్‌ రూ.25 కోట్లు మించరాదు. అలాగే దీర్ఘకాల పెట్టుబడులపై వచ్చే లాభాలకు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. ఫెయిర్‌ మార్కెట్‌ వాల్యూపైనున్న పెట్టుబడులపై, వ్యక్తిగత-హిందూ అవిభాజ్య కుటుంబాల పెట్టుబడులపై పన్నుల భారం తప్పించారు. దీంతో ప్రతిభ, నైపుణ్యం గల ఎందరో యువకులు ఇప్పుడు స్టార్టప్‌లపై దృష్టి సారిస్తుండగా, వీరికి రతన్‌ టాటా, ఆనంద్‌ మహీంద్రా వంటి ఇండస్టీ దిగ్గజాల నుంచీ సహకారం లభిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. 

VIDEOS

logo